విశాఖ వేదికగా జరిగిన తొలిటెస్టులో ఘోరపరాజయం చవిచూసిన దక్షిణాఫ్రికా తర్వాతి మ్యాచ్‌పై దృష్టిపెట్టింది. పుణెలో జరగనున్న ఈ మ్యాచ్‌లో తాము గెలుస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్.
"తొలి ఇన్నింగ్స్‌లో మా స్కోరు చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది. అంత బాగా మేము పోరాడాం. మా జట్టులో చాలా మంది కొత్త ఆటగాళ్లు ఉన్నారు. సీనియర్ క్రికెటర్లు అయిన క్వింటన్ డికాక్, డీన్ ఎల్గర్ అద్భుతమైన శతకాలతో ఆకట్టుకున్నారు. భారత ఉపఖండపు పిచ్‌లపై 400కు పైగా స్కోరు చేయడం అంత సులభం కాదు" - డుప్లెసిస్ దక్షిణాఫ్రికా సారథి.
395 స్కోరు ఛేదిస్తామనే అనుకున్నామని అన్నాడు డుప్లెసిస్
"రెండో ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన చేయలేకపోయాం. 395 లక్ష్యాన్ని ఛేదిస్తామనుకున్నాం. దురదృష్టవశాత్తూ మేము సాధించలేకపోయాం. రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు.ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో విధ్వంసమే సృష్టించాడు. దాదాపు 400 స్కోరు రావడానికి కారణం అతడి ఇన్నింగ్సే కారణం. పుణెలో జరిగే రెండో టెస్టులో సత్తాచాటుతాం" -డుప్లెసిస్, దక్షిణాఫ్రికా సారథి.
తొలి టెస్టులో 395 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది ప్రొటీస్ జట్టు. షమీ ధాటికి 191 పరుగులకు ఆలౌటైంది. 203 పరుగులకు భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.
ఇదీ చదవండి: వైరల్: జడ్డూ క్యాచ్.. బ్యాట్స్‌మన్ షాక్