ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది టీమిండియా. ఆక్లాండ్‌లో తొలి టీ20 గెలిచి, రెండో మ్యాచ్‌లోనూ అదే తరహా ప్రదర్శన చేయాలని భావిస్తోంది. కివీస్ గడ్డపై భారత్‌కు వన్డేలు, టెస్టుల్లో గెలుపు శాతం ఏమంత ఆశాజనకంగా లేదు. అయితే ఈ సారి మాత్రం కివీస్‌పై మనోళ్లు.. టెస్టు సిరీస్ గెలిస్తే చూడాలని కోరుకుంటున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు.
"మేం గతసారి కివీస్ పర్యటనకు వచ్చినపుడు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు 4-1 తేడాతో వన్డే సిరీస్ గెల్చుకున్నాం. ప్రస్తుత జట్టు.. న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్ గెలిస్తే చూడాలని అనుకుంటున్నా. ప్రతి సిరీస్ సమానమే కానీ ఈ ఫార్మాట్లో వారిపై గెలిస్తే ఆ మజానే వేరు. కోహ్లీసేన ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉంది. మేం భారత జట్టులోని సభ్యులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. ఒత్తిడి తీసుకోకుండా ఆడమని కోహ్లీకి చెప్పాం" -సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఇప్పటివరకు 9 సార్లు కివీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. కేవలం రెండుసార్లు(1967-68, 2008-09) మాత్రమే టెస్టు సిరీస్‌లో విజయం సాధించింది. రెండు సార్లు సిరీస్ డ్రాగా ముగిసింది. ఆతిథ్య జట్టు ఐదుసార్లు జయకేతనం ఎగురవేసింది.
ప్రస్తుతం పర్యటనలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20లతో పాటు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది టీమిండియా.