ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడటం ఎంతో ప్రత్యేకమని యువ బౌలర్ దీపక్ చాహర్ అన్నాడు. ఈ జట్టులో ఉండటం ఎంతోమంది అభిమానుల ప్రేమను దక్కేలా చేసిందని చెప్పాడు. స్వస్థలంలో కంటే చెన్నై ప్రజలు తనపై ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా చూపిస్తారని ఆనందం వ్యక్తం చేశాడు. సీఎస్కేలోని ఆటగాళ్లందరూ చెన్నైను తమ సొంత ఊరిలా భావిస్తారని తెలిపాడు. 2016 నుంచి ఈ జట్టుకు ఆడుతున్నాడు చాహర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"చెన్నైకి పోతుంటే ఇంటికి వెళ్తున్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే మా ఊర్లో కంటే అక్కడి వాళ్లు చూపే ప్రేమ అలాంటిది. ఐదారు నెలల క్రితం నాన్న కంటి ఆపరేషన్ కోసం చెన్నై వచ్చాం. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ నా గురించి ఆయనకు గొప్పగా చెప్పారు. ఓ క్రికెటర్‌గా ఇంతకంటే నాకేం ఏం కావాలి"
-దీపక్ చాహర్, క్రికెటర్
దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ కోసం ఇప్పటికే ఆ దేశానికి చేరుకున్నాడు చాహర్. ప్రస్తుతం ఆరు రోజుల క్వారంటైన్లో ఉన్నాడు. ఈ సమయంలో మూడుసార్లు జరిగే వైద్యపరీక్షల్లో నెగటివ్‌గా తేలితేనే బయో బబుల్‌లోకి అడుగుపెడతాడు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 మధ్య ప్రేక్షకులు లేకుండానే ఈ లీగ్ జరగనుంది.
ఇది చూడండి: బ్యాట్స్‌మన్‌కు ఫ్రీ హిట్ ఉంది.. మరి బౌలర్లకు?