ETV Bharat / sports

ఐపీఎల్ వద్దంటే ప్రమాదమే: ఈసీబీ డైరెక్టర్ - ఐపీఎల్ ఈసీబీ డైరెక్టర్

ఐపీఎల్​లో పాల్గొనే ఇంగ్లాండ్ ఆటగాళ్లతో విభేదాలు కోరుకోవట్లేదని తెలిపాడు ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గైల్స్. ఐపీఎల్​పై తేల్చుకోమని చెబితే కొందరు అత్యుత్తమ ఆటగాళ్లను కోల్పోవాల్సి వస్తుందని వెల్లడించాడు.

Ashley Giles
ఆష్లే గైల్స్
author img

By

Published : Apr 1, 2021, 6:32 AM IST

ఐపీఎల్‌లో పాల్గొనే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లతో విభేదాలు కోరుకోవట్లేదని ఈసీబీ డైరెక్టర్‌ ఆష్లే గైల్స్‌ అన్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదా ఫ్రాంచైజీకి ఆడటంపై తేల్చుకోమంటే అగ్రశ్రేణి ఆటగాళ్లను కోల్పోతామని చెప్పాడు.

"ఆటగాళ్లతో విభేదాలు కోరుకోవడం లేదు. భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదముంటుందని అర్థం చేసుకోవాలి. ఐపీఎల్‌ విషయంలో ఆటగాళ్లతో కఠిన వైఖరి అవలంభించాలని అనుకోవట్లేదు. అలా చేస్తే కొందరు అత్యుత్తమ ఆటగాళ్లను కోల్పోతాం."

-ఆష్లే, గైల్స్, ఈసీబీ డైరెక్టర్

ఐపీఎల్​లో ఆడేందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లందరికీ ఆ దేశ క్రికెట్ బోర్డు అనుమతించింది. ఈ కారణంగా లీగ్​లో చివరి దశలో బరిలో దిగే ఆటగాళ్లు జూన్ 2న న్యూజిలాండ్​తో జరిగే తొలి టెస్టుకు దూరమవనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.