వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్. తొలి రోజే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ మంచి స్థితిలో నిలిచామని అభిప్రాయపడ్డాడు.
"తొలి సెషన్లో పరిస్థితులు ఛాలెంజింగ్‌గా అనిపించాయి. బంతి స్వింగ్ అయింది. కీమర్ రోచ్, హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. మొదటి రోజు 5 వికెట్లు కోల్పోయినప్పటికీ మంచి స్థితిలోనే ఉన్నాం"
-మయాంక్ అగర్వాల్, టీమిండియా ఓపెనర్.
విండీస్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశారని, రకీమ్ కార్న్వెల్ నిలకడగా ఆడాడని తెలిపాడు మయాంక్.
"విండీస్ కెప్టెన్ హోల్డర్ సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు అవకాశమివ్వలేదు. అతడు తొలి ఏడు ఓవర్లలో నాలుగు మెయిడిన్లు చేశాడంటే బౌలింగ్ ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పుజారా వికెట్ తీసిన రకీమ్ నిలకడగా బంతులేశాడు" -మయాంక్ అగర్వాల్, టీమిండియా ఓపెనర్.
కింగ్స్టన్ వేదికగా విండీస్‌తో జరుగుతోన్న చివరిదైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(76), మయాంక్ అగర్వాల్(55) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. కరీబియన్ సారథి హోల్డర్ 3 వికెట్లతో రాణించాడు.
ఇవీ చూడండి.. భారీకాయుడు.. అరంగేట్రంలోనే భళా