కరోనా మహమ్మరి వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రీడా పోటీలు కొన్ని వాయిదా పడగా, మరికొన్ని రద్దయ్యాయి. పలు టోర్నీల్లో పాల్గొనాల్సిన ఆటగాళ్లందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే కొందరు తమ ఆటను మరిచిపోకూడదని ప్రాక్టీసును కొనసాగిస్తున్నారు. ఇలానే ఇంట్లోనే బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తూ కనిపించాడు ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్. ఈ వీడియోలో భాగంగా చేతికి, కంటికి సమన్వయం ఎలా ఉండాలో చూపించాడు. దానిని ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మ్యాచ్‌లు లేకపోవడం వల్ల బోర్‌గా ఫీలమవుతున్నానని చెప్పిన స్మిత్.. రోజులో కొంత సమయాన్ని ప్రాక్టీసుకు కేటాయిస్తున్నట్లు వెల్లడించాడు. బ్యాటింగ్ చేసేటపుడు కళ్ల కదలిక చాలా ముఖ్యమని, అందుకే బంతిని తీసుకుని గోడకు ఎదురుగా నిలబడి వీలైనన్నీ సార్లు కొట్టండని అన్నాడు. దీనివల్ల కంటికి, చేతికి సమన్వయం ఉంటుందని చెప్పాడు.
ప్రస్తుతం ఆసీస్ జట్టు తరఫున ఆడుతున్న స్మిత్.. ఇప్పటివరకు 73 టెస్టులు, 125 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. టెస్టుల్లో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మిగతా ఫార్మాట్లలోనూ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కరోనా వల్ల ఈ టోర్నీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది.