ప్రపంచకప్లో నిరాశపర్చిన పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ ఆ టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం గ్లోబల్ టీ20లో ఆడుతోన్న ఈ వెటరన్ ప్లేయర్ బ్రాంప్టన్ వోల్వ్స్తో జరిగిన మ్యాచ్లో రెచ్చిపోయాడు.
ఇష్ సోధి వేసిన 14 ఓవర్ రెండో బంతిని కవర్స్ మీదుగా ఆడాడు మాలిక్. ఆ బంతి 68 మీటర్లు నేరుగా వెళ్లి మైదానంలోని కిటికీ అద్దాల్ని పగులగొట్టింది. అనంతరం 16 ఓవర్లో వాహబ్ రియాజ్ వేసిన బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బాది మ్యాక్సిమమ్ సాధించాడు. ఈ బంతి 67 మీటర్లు వెళ్లి మరో అద్దాన్ని పగులగొట్టింది. ఈ వీడియోను గ్లోబల్ టీ20 అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఈ మ్యాచ్లో వాంకోవర్ నైట్స్.. బ్రాంప్టన్ వోల్వ్స్పై 77 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాలిక్ 26 బంతుల్లో 46 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
-
In an unusual scenario, @realshoaibmalik literally hit two glass breaking sixes.#GT2019 #BWvsVK pic.twitter.com/5kuAQoQBbE
— GT20 Canada (@GT20Canada) August 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">In an unusual scenario, @realshoaibmalik literally hit two glass breaking sixes.#GT2019 #BWvsVK pic.twitter.com/5kuAQoQBbE
— GT20 Canada (@GT20Canada) August 9, 2019In an unusual scenario, @realshoaibmalik literally hit two glass breaking sixes.#GT2019 #BWvsVK pic.twitter.com/5kuAQoQBbE
— GT20 Canada (@GT20Canada) August 9, 2019
ఇవీ చూడండి.. టీమిండియా క్రికెటర్లకు ఇకపై డోప్ పరీక్షలు..!