రంజీ ట్రోఫీ గెలుచుకునేందుకు, ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్లో సౌరాష్ట్ర-బంగాల్ జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే విజయం కోసం కష్టంతో పాటు కొంత అదృష్టం ఉండాల్సిందే. అందుకోసం దారులు వెతకాల్సిందే. ప్రత్యర్థి తప్పులను పసిగట్టి వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాల్సిందే. అలాంటి సంఘటనే ఈ మ్యాచ్‌లో జరిగింది. బంగాల్ ఆటగాడు ఆకాశ్ దీప్ రనౌట్ సౌరాష్ట్రకు కలిసొచ్చింది.
అసలేం జరిగింది?
సౌరాష్ట్ర సారథి జయదేవ్ ఉనద్కత్ వేసిన బంతి, బ్యాట్స్‌మెన్ ఆకాశ్ దీప్‌ను మిస్ అయ్యి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే క్రీజు లైన్‌పై ఉన్న దీప్‌ను కీపర్ రనౌట్ చేయడానికి ప్రయత్నించగా బాల్ వికెట్లను తాకకుండా నేరుగా బౌలర్ ఉనద్కత్ చేతుల్లోకి వెళ్లింది. తన తెలివిని ఉపయోగించిన ఉనద్కత్.. రెప్పపాటులో వికెట్లపైకి త్రో విసిరాడు. ఫలితంగా సరిగ్గా క్రీజుపై ఉన్న ఆకాశ్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 425 పరుగులు చేసింది. అనంతరం 381 పరుగులే చేసి ఆలౌటైంది బంగాల్. ఫలితంగా మ్యాచ్ విజయాన్ని ఖరారు చేసే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 44 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది సౌరాష్ట్ర. ఇంకా రెండో ఇన్నింగ్స్‌లు ఉండగా.. సౌరాష్ట్ర విజయం దాదాపు ఖరారైనట్టే.
-
Unadkat's presence of mind to run out Akash Deep https://t.co/PN3H1tgKOL via @bcci
— ebianfeatures (@ebianfeatures) March 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Unadkat's presence of mind to run out Akash Deep https://t.co/PN3H1tgKOL via @bcci
— ebianfeatures (@ebianfeatures) March 13, 2020Unadkat's presence of mind to run out Akash Deep https://t.co/PN3H1tgKOL via @bcci
— ebianfeatures (@ebianfeatures) March 13, 2020