ధోని టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక కోహ్లి కెప్టెన్సీ చేపట్టాడు. అతడి సారథ్యంలో భారత్ కొంత కాలంగా విజయాలతో దూసుకుపోతుంది. టెస్టుల్లో అగ్రస్థానంలో ఉంది. కానీ కోహ్లి సారథిగా విజయాలు సాధించడానికి ధోని, రోహిత్లే కారణం అంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్.
ప్రస్తుత ప్రపంచకప్లో లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది భారత్. ఆడిన తొమ్మిది మ్యాచ్లో కేవలం ఒకటి మాత్రమే ఓడిపోయింది. అయినా గంభీర్.. కోహ్లీ కెప్టెన్సీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ఐపీఎల్ సమయంలోనూ విరాట్ కెప్టెన్సీపై విమర్శలు కురిపించాడు గంభీర్.
"ధోని, రోహిత్ వలనే టీమిండియాకు విరాట్ మంచి సారథిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు టైటిల్ అందించడంలో విఫలమయ్యాడు. చాలాసార్లు ఆ జట్టు 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత్ జట్టులో ధోని, రోహిత్ ఉన్నారు.. కానీ బెంగళూరులో ధోని, రోహిత్ లేరు అందుకే విరాట్ ఐపీఎల్లో సక్సెస్ కాలేకపోతున్నాడు".
-గంభీర్, టీమిండియా మాజీ ఆటగాడు
ప్రస్తుతం జరుగుతోన్న ప్రపంచకప్లో టీమిండియా సెమీస్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. లీగ్ దశను అగ్రస్థానంతో ముగించిన కోహ్లీసేన టైటిల్పై కన్నేసింది.
-
1) Kohli is a good captain for India because He has Rohit Sharma and MS Dhoni
— Abhishek Mishra (@Ohyessabhi) July 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
2) Kohli, the batsman is in Top 4 in the world ( I mean Top 4)
really?
Such a crybaby this GG pic.twitter.com/TkOAf472Tk
">1) Kohli is a good captain for India because He has Rohit Sharma and MS Dhoni
— Abhishek Mishra (@Ohyessabhi) July 9, 2019
2) Kohli, the batsman is in Top 4 in the world ( I mean Top 4)
really?
Such a crybaby this GG pic.twitter.com/TkOAf472Tk1) Kohli is a good captain for India because He has Rohit Sharma and MS Dhoni
— Abhishek Mishra (@Ohyessabhi) July 9, 2019
2) Kohli, the batsman is in Top 4 in the world ( I mean Top 4)
really?
Such a crybaby this GG pic.twitter.com/TkOAf472Tk
ఇవీ చూడండి.. WC19: వర్షం రావడమే మంచిదైంది