ETV Bharat / sports

'ఐపీఎల్​కు ఇస్తున్న ప్రాధాన్యం రంజీలకు ఇవ్వడం లేదు' - వసీం జాఫర్​ న్యూస్​

క్రికెటర్లు​ అన్ని ఫార్మాట్లలో బాగా ఆడాలని, భారత జట్టులో తన అభిమాన క్రికెటర్ పుజారా అని చెప్పాడు టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్. వీటితో పాటే బోలెడు సంగతుల్ని పంచుకున్నాడు.

Wasim Jaffer feels modern cricketers need to adapt to all formats
'ఐపీఎల్​కు ఇస్తున్న ప్రాధాన్యత రంజీలకు ఇవ్వడం లేదు'
author img

By

Published : Mar 16, 2020, 10:32 AM IST

ఇప్పటి కాలంలో ఆడుతున్న క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో(టెస్టు, వన్డే, టీ20) రాణించాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్​ వసీం జాఫర్​ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇలా చేయటం వల్ల ఈ క్రీడపై ఆదరణ పెరుగుతోందని చెప్పాడు. ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్న ఇతడు.. చాలా విషయాలను పంచుకున్నాడు.

"రాహుల్​ ద్రవిడ్​, వీవీఎస్​ లక్ష్మణ్​ తర్వాత వాళ్లను మరిపించేలా ప్రదర్శన చేస్తున్నాడు నయావాల్ చెతేశ్వర్​ పుజారా. ప్రస్తుతం టీమిండియాలో నా అభిమాన ఆటగాడంటే అతడే. ప్రస్తుత కాలంలో ఇతర ఫార్మాట్లతో పోలిస్తే టీ20​లు అత్యంత ఆదరణ పొందుతున్నాయి. అలా అని ప్రేక్షకులలో ఎక్కువ డిమాండ్​ ఉన్న టీ20 ఫార్మాట్​ను తక్కువ చేసి మాట్లాడలేం. దీనితో పాటే ప్రతి కికెటర్ తప్పకుండా అన్ని ఫార్మట్లలో నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరముంది. ఇప్పుడు ఐపీఎల్​కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ టోర్నీ వల్లే ఎంతో మంది ప్రతిభావంతులు బయటకొస్తున్నారు. ఆ స్థాయిలో దేశవాళీలోని​ రంజీట్రోఫీకి ఆదరణ దక్కకపోవటం బాధ కలిగించే విషయం"

- వసీం జాఫర్​, టీమిండియా మాజీ క్రికెటర్

Wasim Jaffer feels modern cricketers need to adapt to all formats
చతేశ్వర్​ పుజారా

జాఫర్​.. తన 24 ఏళ్ల కెరీర్​లో ఫస్ట్​క్లాస్​లో దాదాపు 19,500 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల కంటే, భారత తరఫున ఎక్కువ​గా టెస్టులే ఆడాడు. 31 టెస్టు​ల్లో 1944 పరుగులు సాధించాడు. వెస్టిండీస్​పై అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత రెండో బ్యాట్స్​మన్ ఇతడే. కెరీర్​లో టీమిండియా తరఫున​ కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు.

ఐపీఎల్‌లోనూ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాడు జాఫర్. ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ కోచింగ్​ సిబ్బందిలో ఒకడిగా ఉన్నాడు.

ఇదీ చూడండి.. ఒలింపిక్స్ ఇంతకీ జరుగుతాయా? లేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.