ETV Bharat / sports

ఏళ్లపాటు యువరాజ్​ సింగ్​కు నిద్రలేని రాత్రులు! - yuvaraj retirement

ఒకానొక సమయంలో క్రికెట్​ను ఆస్వాదించలేకపోవడం వల్లే రిటైర్మెంట్​ ప్రకటించినట్లు చెప్పాడు యువరాజ్​ సింగ్​. ఆడుతున్న సమయంలో తనకు నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయని తెలిపాడు.

yuvaraj
యూవీ
author img

By

Published : Jun 20, 2020, 4:27 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​.. తన రిటైర్మెంట్​ వెనకున్న కారణాన్న వెల్లడించాడు. ఒకానొక దశలో ఆటను ఆస్వాదించలేకపోవడం వల్లే వీడ్కోలు పలికినట్లు పేర్కొన్నాడు. కెరీర్​లో చాలా ఏళ్ల పాటు నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పాడు.

"జీవితంలో దూకుడుగా ఉన్న దశలో చాలా విషయాలు గ్రహించలేం. ఏదో ఓ సందర్భంలో వాటి గురించి ఆలోచిస్తాం. అలానే నేను కొన్ని కారణాల వల్ల రిటైర్మెంట్​కు​ ముందు రెండు-మూడు నెలలు ఇంట్లోనే ఉన్నాను. ఆ సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఎంతో అమితంగా ప్రేమించిన క్రికెట్​ కూడా అందులోనుంచి నన్ను బయటపడేయలేకపోయింది. ఆ సందర్భంలో​ ఆడాలని అనుకున్నా, మానసిక సమస్యల వల్ల వీలుపడలేదు. దీంతో రిటైర్మెంట్​పై ఎన్నో ప్రశ్నలు మదిలో మెదిలాయి. అనంతరం కొన్నిరోజులకు వీడ్కోలు పలికాను"

-యువరాజ్​ సింగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించిన తర్వాత కొంతకాలం ఆటను మిస్ అయినట్లు అనిపించినా.. ఆ తర్వాత అలాంటిదేమి లేేదని అన్నాడు యువీ. బహుశా 20 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఆడటమే ఇందుకు కారణం కావొచ్చని అన్నాడు. ఆడినంతకాలం ఎన్నో ఏళ్లపాటు నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పుకొచ్చాడు. అయితే వీడ్కోలు పలికిన​ తర్వాత మానసిక ప్రశాంతత దొరికిందని, హాయిగా పడుకుంటున్నట్లు వెల్లడించాడు.

yuvi
యూవీ

ఇది చూడండి : బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.