ETV Bharat / sports

'కెరీర్​ కంటే కుటుంబమే నాకు అత్యంత ముఖ్యం'

కరోనా వ్యాప్తి నేపథ్యంలోనూ పలు జాగ్రత్తల మధ్య అంతర్జాతీయ క్రికెట్​ పునఃప్రారంభమైంది. విండీస్​పై ఇప్పటికే టెస్టు​ ట్రోఫీ గెలిచిన ఇంగ్లాండ్.. సెప్టెంబర్​లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీస్​ గురించి మాట్లాడిన ఆసీస్​ వైస్​ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​.. కెరీర్​ గురించి పునరాలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇంగ్లీష్​ జట్టుపై సిరీస్​లు​ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

warner news
'కరోనా సమయంలో కెరీర్​పై పునరాలోచిస్తున్నా..'
author img

By

Published : Jul 29, 2020, 7:50 AM IST

అంతర్జాతీయ కెరీర్​పై పునరాలోచించాల్సి వస్తోందని అన్నాడు ఆస్ట్రేలియా స్టార్​ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​. అందుకు కారణంగా కరోనా వైరస్​ అంటున్నాడు. కుటుంబానికి దూరంగా ఉంటూ.. అనేక షరతులు, పరిమితుల మధ్య మ్యాచ్​లు ఆడాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేశాడు.

david warner news
డేవిడ్​ వార్నర్​

"నా భార్య ముగ్గురు అమ్మాయిలకు నేను ఎంతగానో రుణపడి ఉన్నా. నా కెరీర్లో వీరి పాత్ర కీలకం. ఏం చేయాల్నా కుటుంబానికే తొలి ప్రాధాన్యం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆడాల్సి వచ్చినప్పుడు అన్ని అంశాలు బేరీజు వేసుకోవాలి. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్​ ఆడి, గెలవాలని ఆశించాం. కానీ అది వెనక్కి వెళ్లిపోయింది. వచ్చే ఏడాది భారత్​లో జరిగే టీ20 ప్రపంచకప్​ విషయంలో పునరాలోచించాల్సి వస్తోంది. అప్పటికి నేనే స్థితిలో ఉంటాను. నా కూతుళ్లు స్కూల్లో ఏ స్థాయిలో ఉంటారు అన్నది చూడాలి. ఇవన్నీ నా నిర్ణయంలో కీలకంగా ఉంటాయి. ఎప్పుడు ఆడతాం. ఎంత ఆడతాం అన్నది ప్రధానం కాదు. కుటుంబమే నాకు అత్యంత ముఖ్యం" అని వార్నర్​ అన్నాడు.

ఇంగ్లాండ్​పై రాణిస్తాం...!

సెప్టెంబర్​లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ మధ్య మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్​లు జరగనున్నాయి. అయితే వాటి గురించి మాట్లాడిన ఆసీస్​ క్రికెట్​ జట్టు వైస్​కెప్టెన్​ వార్నర్​.. తన జట్టుకు మద్దతుగా నిలిచాడు​. ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది మార్చి తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్​ ఆడలేదు. అయినా వన్డేల్లో రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. జులైలో జరగాల్సిన ఈ సిరీస్​లు​ కరోనా వల్ల వాయిదా పడ్డాయి. ఇప్పటికే విండీస్​తో విజ్డెన్​​ ట్రోఫీ ఆడిన ఇంగ్లాండ్​.. త్వరలో ఐర్లాండ్​, పాకిస్థాన్​తో మ్యాచ్​లకు సిద్ధమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.