ఆస్ట్రేలియాలో కార్చిచ్చు వల్ల నష్టపోయిన బాధితులకు సాయం చేయాలనే సదుద్దేశంతో ఆ దేశ క్రికెటర్లు ముందుకొస్తున్నారు. ఇప్పటికే గ్లెన్ మ్యాక్స్‌వెల్ , క్రిస్ లిన్, డీఆర్సీ షార్ట్ సిక్సర్‌కు 250 డాలర్ల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా షేన్ వార్న్ కూడా ఆ జాబితాలో చేరాడు. తన బ్యాగీ గ్రీన్ క్యాప్(ఆకుపచ్చ)ను వేలం వేసి.. వచ్చిన డబ్బును బాధితులకు ఇవ్వాలని నిర్ణయించాడు.
"ఈ భయానక కార్చిచ్చు మన దేశం మీద అపనమ్మకం ఏర్పరుస్తోంది. దీని ప్రభావంతో ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. చాలా ఇళ్లు దగ్ధమయ్యాయి. 500 మిలియన్ (50 కోట్లు) జంతువుల ప్రాణాలను హరించిందీ కార్చిచ్చు. బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. అందుకే నా బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను(350) వేలం వేయాలని నిర్ణయించుకున్నా. నా టెస్టు కెరీర్ మొత్తం ఈ క్యాప్‌నే పెట్టుకున్నా." - షేన్ వార్న్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాళ్లు క్రిస్ లిన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డీఆర్సీ షార్ట్ తమ వంతు సాయం చేయాలని నిర్ణయించారు. బిగ్‌బాష్ లీగ్‌లో వాళ్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు 250 ఆస్ట్రేలియా డాలర్లు బాధితులకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఇదీ చదవండి: 'బీసీసీఐ ఆమోదం లేకుండా ఐసీసీ ఏం చేయలేదు'