ETV Bharat / sports

'సచిన్‌ పరుగులను అందుకునేదెవరో చూడాలనుంది' - former Pakistan captain Inzamam-ul-Haq

పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ ఇంజమామ్​ ఉల్​ హక్​​.. దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​​పై ప్రశంసల వర్షం కురిపించాడు. మాస్టర్​ చేసిన 34,357 రన్స్​ను అందుకునే వ్యక్తిని చూడాలనుందని అభిప్రాయపడ్డాడు. లిటిల్​ మాస్టర్​ ఎందుకు అత్యుత్తమమో నాలుగు కారణాలు చెప్పాడు.

Want to see who will cross the mountain of Sachin's runs: Inzamam-ul-Haq
సచిన్‌ చెప్పేందుకు 4 కారణాలివే: ఇంజమామ్​
author img

By

Published : Feb 26, 2020, 5:27 AM IST

Updated : Mar 2, 2020, 2:38 PM IST

భారత దిగ్గజ క్రికెటర్‌ సచిన్ తెందుల్కర్‌పై పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్​ ప్రశంసల జల్లు కురిపించాడు. వన్డేల్లో సచిన్ ద్విశతకం సాధించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇంజమామ్‌ మాట్లాడాడు. పదహారేళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్​ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడని కొనియాడాడు. ప్రపంచ క్రికెటర్లలో తెందుల్కర్​ అత్యుత్తమ ఆటగాడని, అలా చెప్పడానికి నాలుగు కారణాలు ఉన్నాయని తెలిపాడు.

Want to see who will cross the mountain of Sachin's runs: Inzamam-ul-Haq
సచిన్​-ఇంజమామ్​

>> "సచిన్ క్రికెట్ కోసమే పుట్టాడు. క్రికెట్, అతడు అత్యుత్తమ జోడీ. నేను ఇప్పటికీ ఆశ్యర్చంలోనే ఉన్నా.. 16-17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతడు ఎన్నో ఘనతలు సాధించాడు. ఇది అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాడికే సాధ్యమవుతుంది. సచిన్‌కు అంతకు మించిన నైపుణ్యం సొంతం. అతడు 16 ఏళ్లకే వకార్, వసీమ్‌ వంటి బౌలర్లను ఎదుర్కొన్నాడు. ప్రపంచ ప్రమాదకర బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయం."

>> "సచిన్‌ అత్యుత్తమం అనడానికి మరో కారణం అతడి రికార్డులు. అతడు సాధించిన పరుగులు, శతకాల రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. గొప్ప ఆటగాళ్లు 8 - 8.5 వేల పరుగులు సాధిస్తారు. సునీల్‌ గావస్కర్‌ 10 వేల పరుగులు సాధించాడు. కానీ సచిన్ మాత్రం అందరి రికార్డులను బద్దలు కొట్టి పరుగుల ప్రవాహమే సృష్టించాడు. ఇప్పుడు అతడి రికార్డును ఎవరూ అధిగమిస్తారని ఎదురుచూస్తున్నాను."

>> "మూడో కారణం.. అతడు మానసికంగా ఎంతో దృఢంగా ఉంటాడు. అతడికి అభిమానులు చాలా ఎక్కువ. సచిన్‌కు ఉన్న అభిమానులు మరో క్రికెటర్‌కు ఉండరు. అయితే బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు అతడిపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా అతడికి అభిమానులు భారీ సంఖ్యలో ఉంటారు. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోరు సాధించాలని ఆశిస్తుంటారు."

>> "సచిన్‌ ఎంతో తెలివైన క్రికెటర్‌. అంతేకాక మంచి ఆల్‌రౌండర్‌. బంతితోనూ మాయ చేస్తాడు. లెగ్‌ స్పిన్‌, ఆఫ్‌ స్పిన్, మీడియం పేస్‌తో వైవిధ్యం చూపిస్తాడు. నేను ఎంతో మంది లెగ్‌ స్పిన్నర్లను ఎదుర్కొన్నాను. ఎవరూ గూగ్లీలతో ఇబ్బంది పెట్టలేదు. కానీ సచిన్‌ మాత్రం తన గూగ్లీలతో ఎన్నో సార్లు నన్ను బోల్తా కొట్టించాడు. క్రికెట్‌లో సచిన్‌ లాంటి ఆటగాడు ఎవరూ ఉండరు" అని ఇంజమామ్‌ నాలుగు కారణాలు చెప్పాడు. సచిన్ క్రికెట్‌కు ఎప్పటికీ దూరం కావొద్దని, అతడి ఆటను ఆస్వాదించడం ఎంతో బాగుంటుందని తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు, పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా ఘనత సచిన్​ సొంతం.

సచిన్​ తెందుల్కర్​

200 టెస్టులు ఆడిన సచిన్​ 15వేల 921 పరుగులు, 463 వన్డేల్లో 18వేల 426 రన్స్​ సాధించాడు. అంతర్జాతీయ కెరీర్​లో 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే శతకాలు నమోదు చేశాడు. 2013లో క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు.

Last Updated : Mar 2, 2020, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.