ETV Bharat / sports

భారత్- ఇంగ్లాండ్​ సిరీస్ స్వదేశంలోనే: గంగూలీ - England india series in india

ఇంగ్లాండ్​తో భారత్​ ఆడే పరిమిత ఓవర్ల సిరీస్​.. స్వదేశంలోనే జరుపుతామని గంగూలీ వెల్లడించాడు. తమ ఆరాధ్య క్రికెటర్లను, అభిమానులు త్వరలో మైదానాల్లో చూస్తారని చెప్పాడు.

Want series against England on Indian grounds but monitoring COVID situation: Ganguly
భారత్- ఇంగ్లాండ్​ సిరీస్
author img

By

Published : Sep 28, 2020, 7:31 PM IST

Updated : Sep 28, 2020, 8:27 PM IST

కరోనా ప్రభావం ఉన్నప్పటికీ స్వదేశంలోనే భారత్-ఇంగ్లాండ్​​ సిరీస్​ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ అన్నాడు. దేశవాళీ క్రికెట్​ పునఃప్రారంభంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని చెప్పాడు. తమ అభిమాన ఆటగాళ్లు స్వదేశంలో త్వరలో ఆడటం చూస్తారని తెలిపాడు. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు దాదా స్పష్టం చేశాడు.

షెడ్యూల్​ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు​లో ఇంగ్లాండ్​తో పరిమిత ఓవర్ల సిరీస్ టీమ్​ఇండియా ఆడాలి.​ కరోనా వల్ల వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఒకవేళ అప్పటికీ వైరస్ ఉద్ధృతి తగ్గకపోతే ఈ సిరీస్​ను యూఈఏకి తరలించాలని బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పుకార్లకు చెక్​ పెడుతూ గంగూలీ.. ఇక్కడే ఉంటుందని స్పష్టం చేశాడు.

ఈ ఐపీఎల్​లో ధోనీ ప్రదర్శన గురించి కూడా గంగూలీ మాట్లాడాడు. "ఏడాది తర్వాత బ్యాట్​ పట్టుకున్నాడు. తిరిగి గాడిలో పడేందుకు కాస్త సమయం పడుతుంది. త్వరలోనే బాగా ఆడతాడని అనుకుంటున్నాను" అని దాదా అన్నాడు.

ఇదీ చూడండి ఐపీఎల్​: లక్ష్యం ఎంతైనా గెలుపు ముఖ్యం బిగిలూ!

Last Updated : Sep 28, 2020, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.