ETV Bharat / sports

'కోహ్లీ పద్ధతి మార్చుకుంటే మంచిది​' - శ్రేయస్​ ఎంపికపై కోహ్లీ సెహ్వాగ్​

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో శ్రేయస్​ అయ్యర్​ను తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు భారత మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​. శ్రేయస్​ను ఎందుకు తీసుకోలేదని కోహ్లీని ప్రశ్నించాడు. విరాట్ తీరు సరైనది కాదన్నాడు.

Kohli
కోహ్లీ
author img

By

Published : Dec 5, 2020, 4:09 PM IST

టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ తీరుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రేయస్​ అయ్యర్​ను తుది జట్టులో ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు.

"శ్రేయస్​ అయ్యర్ తాను చివరిగా ఆడిన టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. మరి ఏ కారణంతో తొలి టీ20లో అతడిని కోహ్లీ తీసుకోలేదు? 'నన్నెందుకు తీసేశావు' అని కోహ్లీని అడిగే ధైర్యం శ్రేయస్​కు ఉండదు.. ఎందుకంటే కోహ్లీ భారత కెప్టెన్‌గా ఉన్నాడు. ముఖ్యంగా కోహ్లీ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. టీమ్​ఇండియాలో ఉన్న ఆటగాళ్లందరికీ నిబంధనలు వర్తిస్తాయి.. ఒక్క కోహ్లీకి తప్ప. ఎందుకు అతని విషయంలో మాత్రం రూల్స్​ను పట్టించుకోరు. అతనికి నచ్చినట్లుగా బ్యాటింగ్ ఆర్డర్‌ని మారుస్తాడు.. ఆటగాళ్లపై వేటు వేస్తాడు.. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశాలిస్తుంటాడు. ఇలా చేయడం తప్పు. కోహ్లీ తన పద్దతిని మార్చుకుంటే మంచిది."

-సెహ్వాగ్, మాజీ క్రికెటర్

ప్రతి మ్యాచ్​లో తుది జట్టు ఆటగాళ్లను మార్చడం తగదని కోహ్లీకి సూచించాడు సెహ్వాగ్​. ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోతే వారిని ప్రోత్సాహించాలని, అంతేకానీ వారిని పక్కన పెట్టడం సరైనది కాదని అన్నాడు. కోహ్లీ కూడా పేలవమైన ప్రదర్శనలు చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశాడు.

ఇదీ చూడండి : 'కంకషన్' విషయమై సెహ్వాగ్ అలా.. సంజయ్ ఇలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.