ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గణాంకాలు అభిమానులను కలవరపరుస్తున్నాయి. అత్యంత నిలకడకు మారుపేరైనా ఈ పరుగుల యంత్రం.. ఈ ఛాంపియన్‌షిప్‌లో తడబడుతున్నాడు. సగటు, స్ట్రైక్‌రేట్ తగ్గాయి. ఆసియా వెలుపల అతడి రికార్డు అంత మెరుగ్గా కనిపించడం లేదు. న్యూజిలాండ్ పర్యటన మొత్తం అతడు విఫలమయ్యాడు. టీ20, వన్డే, మొదటి టెస్టులో కలిపి కేవలం 201 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక్క అర్థశతకం ఉంది.
గణాంకాల ప్రకారం కోహ్లీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో స్వదేశంలో 6, విదేశాల్లో 6 ఇన్నింగ్స్‌లు ఆడాడు. సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు 113.25 సగటుతో 453 పరుగులు చేసిన విరాట్.. విదేశాల్లో మాత్రం 26.16 సగటుతో 157 పరుగులే చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆసియాలో 398 డాట్ బాల్స్ ఆడగా, విదేశాల్లో 254 మాత్రమే ఆడాడు. కలవరపరుస్తున్న అంశం ఏంటంటే ఆసియా వెలుపల అతడి సగటు పేలవంగా ఉంది.
చెతేశ్వర్ పుజారా (13.66), రిషభ్ పంత్ (20.40) తర్వాత భారత జట్టులో అత్యల్ప సగటు కోహ్లీ (26.16)దే. మయాంక్ అగర్వాల్ (172 పరుగులు; 28.66 సగటు), హనుమ విహారి (311; 62.20), అజింక్య రహానె (346; 69.20) అతడి కన్నా మెరుగ్గా ఉన్నారు.
అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్‌ను ప్రపంచంలోనే నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా పరిగణిస్తుంటారు. విఫలమైన ప్రతి విదేశీ గడ్డపైనా అతడు పుంజుకున్నాడు. అత్యంత నిలకడతో పరుగుల వరద పారించాడు. వరుస శతకాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తించాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులోనూ అదే పని చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.