మైదానంలో దూకుడుగా, ప్రత్యర్థి జట్లపై హోరాహోరీగా బ్యాటింగ్ చేసే టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ.. మూగజీవాల పట్ల ప్రేమను చాటుకున్నాడు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా వాటి కోసం రెండు చోట్ల ఆశ్రయం కల్పించేందుకు సిద్ధమయ్యాడు. ముంబయి పరిసర ప్రాంతాల్లోని మలడ్, బోయిసర్‌లో వీటిని నిర్మించనున్నారు.
ఇందుకోసం కోహ్లీ ఆవాజ్ సంస్థతో కలిసి ఈ మంచిపనికి శ్రీకారం చుట్టబోతున్నాడు. మలద్‌లో జంతువల కోసం తాత్కాలిక పునరావస కేంద్రం ఏర్పాటు చేయనుండగా, కళ్లు కనబడని, కదల్లే జంతువుల కోసం బోయిసర్‌లో శాశ్వత ఆశ్రయం నిర్మించనున్నారు. వాటి చికిత్స కోసం అంబులెన్స్‌లను కూడా కోహ్లీ ఏర్పాటు చేయనున్నాడు.
![Virat Kohli's foundation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9650890-106-9650890-1606221868939_2202newsroom_1613997234_205.jpg)
"నగరంలో ఎలాంటి ఆవాసాలు లేని జంతువులకు ఆశ్రయం కల్పించాలనేది మా కల. ఈ ప్రాజెక్టులో భాగంగా మూగజీవాలకు సహాయపడటం కోసం వివిలాడ్స్, ఆవాజ్ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది" అని కోహ్లీ చెప్పాడు.