ETV Bharat / sports

'అది జరగకపోతే కోహ్లీ తప్పుకోవాల్సిందే' - kohli out of captaincy

భారత్​ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌.. ఈ రెండింటింలో కనీసం ఒక్కటైనా కోహ్లి కెప్టెన్సీలో టీమ్​ఇండియా గెలవాలని అన్నాడు ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ మాంటీ పనేసర్‌. లేదంటే విరాట్​ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అభిప్రాయపడ్డాడు.

kohli
కోహ్లీ
author img

By

Published : Jan 23, 2021, 2:24 PM IST

టీమ్​ఇండియా సారథి విరాట్‌ కోహ్లిపై ఇంగ్లాండ్​ మాజీ ఆటగాడు మాంటీ పనేసర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానున్న టీ20, వన్డే ప్రపంచకప్‌లను భారత జట్టు గెలవకపోతే కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అభిప్రాయపడ్డాడు. కోహ్లి సారథ్యంలో టీమ్​ఇండియా సిరీస్‌లు చాలానే గెలిచినా.. ఐసీసీ ట్రోఫీలను సొంతం చేసుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు మాంటీ.

'భారత్​ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌.. ఈ రెండింటిలో కనీసం ఒక్కదాన్నయినా కోహ్లీ కెప్టెన్సీలో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది జరగకపోతే సారథి పదవి నుంచి కోహ్లీ దిగిపోవాల్సిందే. అతడు లేకున్నా టీమ్​ఇండియా సిరీస్‌లు గెలవగలదని ఆసీస్‌ పర్యటనతో నిరూపితమైంది. రహానె, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కలిసి నాయకత్వం వహిస్తూ తీసుకునే నిర్ణయాలు బాగా పనిచేస్తాయని నా అభిప్రాయం. విరాట్​ దూకుడైన ఆటతీరు నాకు నచ్చుతుంది. కానీ తన వైఖరి మార్చుకోవాలి. టెస్టు సిరీస్​లో రహానె, రోహిత్ శర్మ, రవిశాస్త్రితో కలిసి వారి అభిప్రాయాలను కూడా తీసుకోవాలి.'

-మాంటీ పనేసర్​, ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​.

ఇంగ్లాండ్​ జట్టు ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించనుంది. టీమ్​ఇండియాతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి : టెస్టు ర్యాంకింగ్స్: నాలుగుకు పడిపోయిన కోహ్లీ.. పుజారా@7

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.