ETV Bharat / sports

విరుద్ధ ప్రయోజనాల విషయమై కోహ్లీపై ఫిర్యాదు

author img

By

Published : Jul 5, 2020, 8:26 PM IST

Updated : Jul 5, 2020, 8:35 PM IST

విరుద్ధ ప్రయోజనాల అంశం అనే నిబంధనను కోహ్లీ అతిక్రమించాడని బీసీసీఐకి ఫిర్యాదు చేశారు ఎమ్​సీఏ సభ్యుడు సంజయ్ గుప్తా. విరాట్ క్రికెటర్​గానే కాకుండా​ మరో పదవిలోనూ కొనసాగుతున్నాడని తన మొయిల్​లో పేర్కొన్నారు.

విరుద్ధ ప్రయోజనాల విషయమై కోహ్లీపై ఫిర్యాదు
కోహ్లీ

విరుద్ధ ప్రయోజనాల అంశంలో కెప్టెన్​ కోహ్లీపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా.. బీసీసీఐ ఎథిక్స్​ ఆఫీసర్​ డీకే జైన్​కు మెయిల్ పంపారు. ఇందులో విరాట్ వ్యాపార సంస్థల గురించి ప్రస్తావించారు. లోధా ప్యానెల్ సిఫారసులను అతడు​ ఉల్లంఘిస్తున్నాడని గుప్తా పేర్కొన్నారు.

క్రికెట్​లో పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనతో పరిపాలన మరింత మెరుగ్గా సాధ్యమవుతుందని బీసీసీఐ రాజ్యాంగ పునర్నిర్మాణ సమయంలో లోధా కమిటీ స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధన వల్లే బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ సహా పలువురు మాజీ క్రికెటర్లు అనేక పదవులను వదులుకోవాల్సి వచ్చింది.

Virat Kohli under conflict scanner, Gupta writes to BCCI Ethics Officer
కోహ్లీ

"సుప్రీం కోర్టు ఆమోదించిన బీసీసీఐ రూల్​ నంబర్​ 38(4) నిబంధనలో భాగంగా కోహ్లీ ఒకేసారి రెండు పదవులను చేపట్టారు. కాబట్టి అతడు ఏదో ఓ పోస్టును వదులుకోవాలి. ఈ విషయమై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఎథిక్స్ ఆఫీసర్​ను కోరుతున్నా. లోధా కమిటీ నిబంధనలను అమలుపరచాలనేదే ఈ ఫిర్యాదు ముఖ్య ఉద్దేశం. ఓ వ్యక్తి ఎదుగుదలకు నేను ఎప్పుడూ బాధపడను. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించకూడదు. సుప్రీం కోర్టును ప్రతి ఒక్కరూ గౌరవించాలి. 100 శాతం నిబంధనలను పాటించాలి"

సంజీవ్ గుప్తా, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు

స్పోర్ట్స్​ ఎల్​ఎల్​పీ అనే కంపెనీతో భారత కెప్టెన్​కు సంబంధాలున్నాయని గుప్తా మెయిల్​లో పేర్కొన్నారు. కార్నర్​స్టోన్​ వెంచర్​ పార్ట్​నర్స్ ఎల్​​ఎల్​పీతో విరాట్​కు భాగస్వామ్యం ఉందని ఇదివరకే వెల్లడించింది.

ఇదీ చూడండి:భారత ఆటగాళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అఫ్రిదీ

Last Updated : Jul 5, 2020, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.