ETV Bharat / sports

'కోహ్లీ, స్మిత్​ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్​మెన్లు'

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, ఆస్ట్రేలియా క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​లపై ప్రశంసలు కురిపించాడు​ డేవిడ్​ వార్నర్​. కోహ్లీ, స్మిత్​ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్​మెన్లని తెలిపాడు. భారత్​తో డిసెంబరులో జరగాల్సిన టెస్టు సిరీస్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వార్నర్​ వెల్లడించాడు.

Virat Kohli, Steve Smith two of the best batters in all formats: David Warner
'కోహ్లీ, స్మిత్​లు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్​మెన్లు'
author img

By

Published : Jun 22, 2020, 4:15 PM IST

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్​ స్మిత్​లు ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ బ్యాట్స్​మెన్లని ఆసీస్ ఓపెనర్ డేవిడ్​ వార్నర్ తెలిపాడు. ఏ ఫార్మాట్లలో అయినా పరుగులు రాబట్టడంలో వీరిద్దరూ సిద్ధహస్తులని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ ఏడాది డిసెంబరులో భారత్​తో జరగనున్న బోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని చెప్పాడు​.

"కోహ్లీ, స్మిత్​లను పోలిస్తే ఇద్దరూ ఉత్తమ బ్యాట్స్​మెన్లే. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన చేయగల సత్తా వారిలో ఉంది. వీరిద్దరూ ప్రపంచంలో కెల్లా గొప్ప బ్యాట్స్​మెన్లు. భారత్​తో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇది బౌలర్లకు, బ్యాట్స్​మెన్లకు మధ్య జరగబోయే యుద్ధం. భారత బ్యాటింగ్‌ లైనప్‌ ప్రస్తుతం పటిష్టంగా ఉంది. వారిని టార్గెట్‌ చేసేందుకు మా బౌలర్లూ సిద్ధంగా ఉన్నారు".

-డేవిడ్​ వార్నర్​, ఆస్ట్రేలియా ఓపెనర్

కరోనా సంక్షోభం కారణంగా మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రీడాటోర్నీలు వాయిదా పడ్డాయి. తాజా పరిస్థితుల్లో క్రికెట్​ టోర్నీలు తిరిగి ప్రారంభించడానికి పలు దేశాల బోర్డులు సన్నాహాలు చేస్తున్నాయి. భారత్​, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన బోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్​ డిసెంబరు 3 నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది. ​

ఇదీ చూడండి... కోహ్లీని ఈసారి స్లెడ్జింగ్​ చేయను: డేవిడ్​ వార్నర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.