ETV Bharat / sports

వామ్మో.. విరాట్ కోహ్లీ కళ్లకేమైంది.?

టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ.. మైదానంలోనే కాకుండా బయటా చాలా హుషారుగా కనిపిస్తాడు. తోటి ఆటగాళ్లతో కలివిడిగా ఉండే ఈ స్టార్​ క్రికెటర్​​.. అప్పడప్పుడు తన ఫొటోలతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తాడు. తాజాగా షమి, పృథ్వీ షాతో కలిసి తీసుకున్న ఓ ఫొటో నెట్టింట షేర్​ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

virat kohli
వామ్మో.. విరాట్ కోహ్లీ కళ్లకేమైంది.?
author img

By

Published : Feb 16, 2020, 1:12 PM IST

Updated : Mar 1, 2020, 12:32 PM IST

విరాట్​ కోహ్లీ... అతడి హావభావాలు, మాటలు, భావోద్వేగం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వీటితో పాటు సామాజిక మాధ్యమాల్లో అతడు చేసే పోస్టులైతే నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం న్యూజిలాండ్​ పర్యటనలో ఉన్న విరాట్‌ కోహ్లీ.. తాజాగా ఓ ఫొటో షేర్​ చేశాడు. ఇందులో షమి, పృథ్వీ షాతో కలిసి విచిత్రమైన ఫోజిచ్చాడు. అందులో కళ్లు దగ్గరకు చేసి మిస్టర్​ బీన్​లా కనిపించాడు. ఇది నెట్టంట వైరల్​గా మారింది. దీనిపై అభిమానులు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ కళ్లకు ఏమైందంటూ ట్వీట్లు చేస్తున్నారు.

virat kohli news
షమి, పృథ్వీషాతో కోహ్లీ

కివీస్​ జట్టుతో వన్డే సిరీస్​ తర్వాత కాస్త విరామం దొరకడం వల్ల టీమిండియా ఆటగాళ్లు సరదాగా గడుపుతున్నారు. ఇటీవల కొందరు ఆటగాళ్లు పుటారురులోని ప్రకృతి సోయగమైన బ్లూ స్ప్రింగ్స్‌ను సందర్శించారు. అక్కడ విరుష్క జంటతో దిగిన ఫొటోను మహ్మద్‌ షమి తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా విరాట్​ తన సతీమణి అనుష్కతో తీసుకున్న సెల్ఫీ కూడా వైరల్​ అయింది.

virat kohli news
అనుష్క,షమి, సైనీతో విరాట్​
virat kohli news
విరుష్క జోడీ

భారత జట్టు.. కివీస్​తో టెస్టు సిరీస్​కు సిద్ధమవుతోంది. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 21 నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. తాజాగా న్యూజిలాండ్​ ఎలెవన్​తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రా అయింది.

Last Updated : Mar 1, 2020, 12:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.