ETV Bharat / sports

కోహ్లీ, రోహిత్ నాకు పెద్దన్నల్లాంటి వారు: చాహల్

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తనకు పెద్దన్నల్లాంటి వారని తెలిపాడు టీమ్​ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. వీరిద్దరూ టీమ్​ఇండియాకు ఆడుతూ ఎన్నో ఘనతల్ని సాధించారని అన్నాడు. ---

కోహ్లీ
కోహ్లీ
author img

By

Published : Jun 8, 2020, 12:54 PM IST

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తనకు పెద్దన్నల్లాంటి వారని తెలిపాడు టీమ్​ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. వారిద్దరూ తనకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారని అన్నాడు. కోహ్లీ, రోహిత్​లు భారత జట్టుకు ఆడుతూ ఎన్నో ఘనతల్ని సాధించారని పేర్కొన్నాడు.

"కోహ్లీ, రోహిత్ ఇద్దరూ లెజెండ్స్. విరాట్​తో కలిసి నేను అండర్​-15 జట్టులోనూ ఆడా. క్రమశిక్షణ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. బౌలింగ్​లో ఎప్పుడైనా ఇబ్బందిపడితే నా వద్దకు వచ్చి నెగిటివ్​ మైండ్​సెట్​ను వదలమని చెబుతాడు. ఆర్సీబీ జట్టుకు ఆడినపుడు కూడా అదే చేసేవాడు. విరాట్, రోహిత్ ఇద్దరూ నాకు పెద్దన్నల్లాంటి వారు. టీమ్​ఇండియాకు ఆడుతూ వారిద్దరూ ఎన్నో ఘనతల్ని సొంతం చేసుకున్నారు. అందరీకి ఆదర్శంగా నిలుస్తున్నారు."

-చాహల్, టీమ్​ఇండియా స్పిన్నర్

లాక్​డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు చాహల్. ఈ సమయంలో టిక్​టాక్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉంటూ సహఆటగాళ్ల ఫొటోలు, వీడియోలపై అప్పుడప్పుడూ ఫన్నీ కామెంట్లు పెడుతూ ఉంటాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.