బంగ్లాదేశ్‌తో 2015లో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ పాత్ర పోషించినప్పటి పరిస్థితులను తాజాగా గుర్తుచేసుకున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆ మ్యాచ్‌లో కీపర్‌గా వ్యవహరిస్తున్న ధోనీ.. అత్యవసరంగా బాత్రూమ్కు వెళ్లిన సందర్భంలో అతని స్థానంలో కోహ్లీ కీపింగ్ చేశాడు. ఆనాడు జరిగిన సంఘటనను మయాంక్ అగర్వాల్‌తో జరిగిన చాట్ సెషన్లో తాజాగా వెల్లడించాడు విరాట్.
"అలా ఎలా జరిగిందో ఒకసారి మహీ భాయ్‌ని అడగండి. దయచేసి రెండు ఓవర్లు కీపర్‌గా ఉండు అన్నాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న నేను కీపర్‌గా ఉంటూనే ఫీల్డింగ్‌ను సెట్ చేశా. ఇలా ఒకేసారి రెండు పనులపై ధోనీ ఎలా దృష్టి సారించేవాడో అప్పుడే నాకు అర్థమైంది. నేను వికెట్ కీపింగ్ చేసే క్రమంలో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేస్తున్నాడు. అప్పుడు ఆ బంతి నా ముక్కుకు తగలవచ్చని భయపడ్డా. అలా జరిగితే అవమానకరంగా ఉంటుందని భావించి హెల్మెట్ ధరించాలని అనుకున్నా. కానీ, హెల్మెట్ ధరించలేకపోయా".
-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
మయాంక్ అగర్వాల్‌తో జరిగిన చాట్‌షో ముందు ఎపిసోడ్లో టెస్టు క్రికెట్లో ఆటను డ్రాగా ముగించడం తన ఎంపిక కాదని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితిలోనైనా తాను రాజీపడబోనని వెల్లడించాడు. చివరి రోజున 10 వికెట్లు చేతిలో ఉండి జట్టు 300 పరుగులు చేయాల్సి ఉన్నా.. తాను ఎప్పుడూ డ్రా దిశగా మొగ్గుచూపనని స్పష్టం చేశాడు.