ETV Bharat / sports

ఎవరు ఏమనుకుంటున్నారో పట్టించుకోను: కోహ్లీ - భారత్ న్యూజిలాండ్

న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగిన తొలి టెస్టులో కివీస్ ఘనవిజయం సాధించింది. ఈ పర్యటనలో వరుసగా విఫలమవుతున్న సారథి విరాట్ కోహ్లీపై విమర్శలూ వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు కోహ్లీ.

కోహ్లీకోహ్లీ
కోహ్లీ
author img

By

Published : Feb 24, 2020, 2:29 PM IST

Updated : Mar 2, 2020, 9:46 AM IST

న్యూజిలాండ్​తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పరాజయం చెందింది. సమష్టిగా విఫలమైన జట్టు టెస్టు ఛాంపియన్ షిప్​లో మొదటి ఓటమిని చవిచూసింది. సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్​లో విఫలమయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ తన బ్యాటింగ్​ బాగానే ఉందని చెప్పాడు.

"ఈ పర్యటనలో నేను బాగానే ఆడుతున్నా. కొన్నిసార్లు మంచి స్కోర్లు చేయనంత మాత్రాన బ్యాటింగ్‌ విధానం మారినట్లు కాదు. దీర్ఘ కాలంగా తీరిక లేకుండా ఆడటం వల్ల ఒక్కోసారి రాణించలేం. ఒక్క ఇన్నింగ్స్‌ బాగా ఆడితే బయట మాట్లాడుకునే పరిస్థితులు మారిపోతాయి. కానీ నేను అలా ఆలోచించేవాడిని కాదు. బయటివాళ్లు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తే.. నేను కూడా వారి మధ్యే ఉండేవాడిని. చిన్నచిన్న పొరపాట్లను సరిచేసుకుని ప్రాక్టీస్‌ సెషన్‌లో మరింత కష్టపడితే సరైన ఫలితాలొస్తాయి. జట్టు విజయం సాధించినప్పుడు 40 పరుగులైనా సరిపోతాయి. అదే ఓటమిపాలైతే.. శతకం బాదినా ఉపయోగం ఉండదు."

-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి

మంచి ప్రదర్శనతో గర్వపడాలని, తాను ఎల్లప్పుడూ అదే చేశానన్నాడు కోహ్లీ. రెండో టెస్టులో విజయం సాధించడానికి కృషిచేస్తానని స్పష్టం చేశాడు. ఎలాంటి జట్టునైనా, ఎక్కడైనా ఓడించగల సత్తా తమకుందని తెలిసి కూడా చాలా మంది విమర్శిస్తారని కోహ్లీ గుర్తు చేశాడు. ఒకవేళ భారత్‌ రెండో టెస్టులో ఓటమిపాలైనా తాము ఆందోళన చెందమని, అంతర్జాతీయ స్థాయిలో ఆడటం అంత తేలిక కాదని చెప్పాడు. ఆటలో గెలుపోటములు సర్వసాధారణమని, ఓటముల నుంచే తమ తప్పులను తెలుసుకోగలమని కోహ్లీ వివరించాడు.

Last Updated : Mar 2, 2020, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.