టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. అతడి గురించి మైదానంలో, వెలుపలా చర్చలు సాగుతూనే ఉన్నాయి. భారత్×ఆసీస్ మధ్య జరిగిన రెండో టీ20లోనూ ప్రత్యర్థి కెప్టెన్ మాథ్యూ వేడ్ సైతం ధోనీ మెరుపు వికెట్ కీపింగ్ నైపుణ్యాల గురించి శిఖర్ ధావన్‌తో మాట్లాడాడు. అంతేగాక భారత జట్టు పరాజయాలు చవిచూసినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు జట్టులో మహీ ఉంటే ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అతడిని తరచూ జ్ఞాపకం చేసుకుంటుంటారు.
-
Even @imVkohli Too Miss Our Master @msdhoni 😖#MSDhoni | #Dhoniforlife @DhoniArmyTN | @TeluguMSDians pic.twitter.com/gW5d4pjTKt
— MSD Kingdom™ (@MSDKingdom) December 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Even @imVkohli Too Miss Our Master @msdhoni 😖#MSDhoni | #Dhoniforlife @DhoniArmyTN | @TeluguMSDians pic.twitter.com/gW5d4pjTKt
— MSD Kingdom™ (@MSDKingdom) December 7, 2020Even @imVkohli Too Miss Our Master @msdhoni 😖#MSDhoni | #Dhoniforlife @DhoniArmyTN | @TeluguMSDians pic.twitter.com/gW5d4pjTKt
— MSD Kingdom™ (@MSDKingdom) December 7, 2020
అలాగే సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ ధోనీని ఎంతో మిస్ అవుతున్నామని అభిమానులు ప్లకార్డులతో మైదానంలో ప్రదర్శించారు. అయితే ఆ సమయంలో బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న భారత సారథి విరాట్ కోహ్లీ అభిమానులతో తాను కూడా మిస్ అవుతున్నాని తెలియజేస్తూ సంజ్ఞ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ ఇదే వేదికగా మంగళవారం జరగనుంది.
ఇదీ చూడండి :ధోనీ, కోహ్లీ తర్వాత హార్దిక్ పాండ్యనే అలా!