విరాట్ కోహ్లీ.. ఈ పేరు ప్రస్తుతం ఓ సెన్సేషన్. అతడికి సహచరులతో పాటు బయట లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. వీరిలో చాలా మంది అతడి వస్త్రధారణ, కేశాలంకరణ వంటి అంశాలను అనుకరిస్తూ కనిపిస్తుంటారు. అయితే ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా చిరాగ్ కిలారే అనే ఓ అభిమాని వినూత్నంగా దర్శనమిచ్చాడు. తన తల వెనక విరాట్ ముఖాన్ని తలపించేలా జుత్తు కత్తిరించుకున్నాడు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్గా మారింది.
-
The best @imVkohli
— Chirag Khilare (@Chirag_Viratian) December 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
From heart to head 🇮🇳🥰#viratianchirag @OaktreeSport @buntysajdeh @Cornerstone_CSE @jogeshlulla @BCCI @BCCIdomestic @RCBTweets @rcbfanarmy @ICC @cricketworldcup @imVkohli @vkfofficial @virendersehwag @gauravkapur @jatinsapru @IrfanPathan @RaviShastriOfc pic.twitter.com/ojQqNGWzGL
">The best @imVkohli
— Chirag Khilare (@Chirag_Viratian) December 12, 2019
From heart to head 🇮🇳🥰#viratianchirag @OaktreeSport @buntysajdeh @Cornerstone_CSE @jogeshlulla @BCCI @BCCIdomestic @RCBTweets @rcbfanarmy @ICC @cricketworldcup @imVkohli @vkfofficial @virendersehwag @gauravkapur @jatinsapru @IrfanPathan @RaviShastriOfc pic.twitter.com/ojQqNGWzGLThe best @imVkohli
— Chirag Khilare (@Chirag_Viratian) December 12, 2019
From heart to head 🇮🇳🥰#viratianchirag @OaktreeSport @buntysajdeh @Cornerstone_CSE @jogeshlulla @BCCI @BCCIdomestic @RCBTweets @rcbfanarmy @ICC @cricketworldcup @imVkohli @vkfofficial @virendersehwag @gauravkapur @jatinsapru @IrfanPathan @RaviShastriOfc pic.twitter.com/ojQqNGWzGL
చాలా సంవత్సరాల నుంచి విరాట్ ఆడే ప్రతి మ్యాచ్కు వెళ్తున్నానని, భారత్ అండర్-19 జట్టుకు కెప్టెన్ అయినప్పటి నుంచే కోహ్లీని అభిమానిస్తున్నానని చెప్పాడు చిరాగ్. తన జుత్తును ఇలా కత్తిరించుకునేందుకు సుమారు 6-8 గంటలు పడుతుందని అన్నాడు. అయితే ఇంతవరకు అతడిని కలిసే అవకాశం రాలేదని చెప్పాడు.
"ఒకవేళ కోహ్లీని కలిసే అవకాశమొస్తే, ముందు అతడి పాదాన్ని ముట్టుకుంటాను. ఆ తర్వాత కౌగిలించుకుంటాను. అప్పుడు ఫొటో దిగుతాను" -చిరాగ్ కిలారే, విరాట్ వీరాభిమాని
ఈ మ్యాచ్లో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత టీమిండియా బ్యాట్స్మన్ 255 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు వార్నర్-ఫించ్ సులువుగా ఈ లక్ష్యాన్ని పూర్తి చేశారు. రెండో మ్యాచ్ రాజ్కోట్ వేదికగా.. శుక్రవారం జరగనుంది.
ఇవీ చదవండి: