ETV Bharat / sports

రోహిత్ శర్మను సమం చేసిన కెప్టెన్ కోహ్లీ - Virat Kohli news

భారత్ తరఫున పోటీ పడి పరుగులు చేస్తున్న కోహ్లీ.. టీ20 ఫార్మాట్​లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్​మన్​గా నిలిచాడు.

Virat Kohli equals Rohit's record for most half-centuries in T20Is
రోహిత్ శర్మను సమం చేసిన కోహ్లీ
author img

By

Published : Dec 10, 2020, 10:22 AM IST

టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ.. సహచర ఆటగాడు రోహిత్ శర్మను సమం చేశాడు. టీ20ల్లో వీరిద్దరూ ప్రస్తుతం అందరి కంటే ఎక్కువగా 25 అర్ధశతకాలతో ఉన్నారు. ఆస్ట్రేలియా మూడో టీ20లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్.. ఈ ఘనత సాధించాడు.

కోహ్లీ ఈ మార్క్​ను 79 ఇన్నింగ్స్​ల్లో అందుకోగా, రోహిత్​కు 100 ఇన్నింగ్స్​లు పట్టింది. వీరి తర్వాతి స్థానాల్లో వార్నర్(19), ఐర్లాండ్ ఆటగాడు పౌల్ స్టిర్లింగ్(18) ఉన్నారు.

Virat Kohli equals Rohit's record
టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ

ఇప్పటికే వన్డే సిరీస్​, టీ20 సిరీస్​లో పూర్తి చేసుకున్న భారత జట్టు.. డిసెంబరు 17 నుంచి టెస్టులు ఆడనుంది. తొలి మ్యాచ్​లో డే/నైట్ పద్ధతిలో జరగనుంది.

ప్రస్తుతం బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న రోహిత్ శర్మ.. శుక్రవారం జరిగే ఫిట్​నెస్​లో పాల్గొంటాడు. అందులో అర్హత సాధిస్తే ఆసీస్​తో చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండే అవకాశముంది.

ఇది చదవండి: అందుకే ఆసీస్​పై గెలిచాం.. భారత క్రికెటర్ల వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.