ETV Bharat / sports

'నేను ఫిట్​గా తయారవ్వడానికి కారణం అతడే' - former India strength and conditioning coach Shankar Basu

తాను ఫిట్​గా ఉండటానికి భారత మాజీ ఫిట్​నెస్​ కోచ్​ శంకర్​ బసు కారణమని అన్నాడు టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. బసు చెప్పిన నియమాలను పాటిస్తూ ఆటలో ఫిట్​గా కొనసాగుతున్నానని తెలిపాడు. భారత ఫుట్​బాల్​ ప్లేయర్​ సునీల్​ ఛెత్రితో కలిసి ఇన్​స్టాగ్రామ్​ లైవ్​లో పాల్గొన్న కోహ్లీ ఈ విషయాన్ని వెల్లడించాడు.

Virat Kohli credits Shankar Basu for his transformation into a supremely fit athlete
'నేను ఫిట్​గా అవ్వడానికి కారణం అతడే'
author img

By

Published : May 18, 2020, 10:59 AM IST

భారత జట్టు మాజీ ఫిట్​నెస్​ కోచ్​ శంకర్​ బసుపై కెప్టెన్ విరాట్​ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తాను ఇంత ఫిట్​గా మారడానికి కారణం అతడేనని తెలిపాడు. భారత ఫుట్​బాల్​ ప్లేయర్​ సునీల్​ ఛెత్రితో కలిసి ఇన్​స్టాగ్రామ్​ లైవ్ సెషన్​లో పాల్గొన్న కోహ్లీ ఈ విషయాన్ని వెల్లడించాడు.

"నేను ఫిట్​గా ఉండటానికి ప్రధాన కారణం మాజీ ఫిట్​నెస్​ కోచ్​ శంకర్​ బసు. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరులో ఉన్నప్పుడు వెయిట్​ లిఫ్టింగ్​ను పరిచయం చేశాడు. అది చేయడానికి నేను కొంత సంశయించాను. అప్పుడు నాకు వెన్నెముక నొప్పిగానూ ఉండేది. కానీ మూడు వారాల్లో దాని ఫలితం చూసి నేను ఆశ్చర్యపోయాను. దాని తర్వాత తినే డైట్​పై దృష్టి సారించాను. ఏదేమైనా దేశం కోసం ఆడే ఆటలో ఉన్మాదిలా కష్టపడాలి.. అలా చేయలేకపోతే జట్టు నుంచి వైదొలగాలి". - విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

Virat Kohli credits Shankar Basu for his transformation into a supremely fit athlete
విరాట్​ కోహ్లీ

పోర్చుగీస్​ ఫుట్​బాల్​ స్టార్​ క్రిస్టియానో రొనాల్డో మనస్తత్వం తనకు స్ఫూర్తినిస్తుందని తెలిపాడు కోహ్లీ. భార్య అనుష్క శర్మను ఆదర్శంగా తీసుకుని శాకాహారిగా మారిన కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్​లో అత్యధిక పరుగులు సాధించడం సహా జట్టులో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

ఇదీ చూడండి.. వచ్చే నెల నుంచి దేశవాళీ టోర్నీలు ప్రారంభం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.