ETV Bharat / sports

అంపైర్​తో గొడవ.. కోహ్లీపై ఓ మ్యాచ్​ నిషేధం! - విరాట్​ కోహ్లీ నితిన్​ మేనన్

ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టులో అంపైర్​తో గొడవ పెట్టుకున్న కారణంగా టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై వేటు పడనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం కోహ్లీకి.. నాలుగు డీ-మెరిట్​ పాయింట్లు ఇవ్వడం సహా అతడిపై ఓ టెస్టులో నిషేధం విధించే అవకాశం ఉంది.

Virat Kohli could face one-match suspension for breaching ICC's Code of Conduct
అంపైర్​తో గొడవ.. కోహ్లీపై ఓ మ్యాచ్​ నిషేధం!
author img

By

Published : Feb 17, 2021, 10:10 AM IST

ఐసీసీ నియమావళిని ఉల్లంఘించిన కారణంగా టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.. ఓ మ్యాచ్​ నిషేధం​ ఎదుర్కొనే అవకాశం ఉంది. సోమవారం జరిగిన రెండో టెస్టులో అంపైర్​ నితిన్​ మీనన్​తో కోహ్లీ గొడవ పెట్టుకోవడమే అందుకు కారణమని తెలుస్తోంది.

ఏం జరిగిందంటే?

రెండో టెస్టు మూడో రోజు చివరి సెషన్​లో అక్షర్​ పటేల్​ వేసిన బౌలింగ్​లో ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​ ఎల్బీడబ్ల్యూగా భారత జట్టు అప్పీల్​ చేసింది. బంతి రూట్​ ప్యాడ్​కు వెనుక భాగంలో తగిలిన తర్వాత కీపర్​ రిషబ్​ పంత్​ క్యాచ్​ పట్టాడు. అయితే దీనిపై అంపైర్​ నితిన్​ మేనన్​ నాటౌట్​గా ప్రకటించాడు. దీంతో టీమ్ఇండియా రివ్యూకు వెళ్లింది. అయితే అందులో బంతి బ్యాట్​కు తగిలిన ఆనవాలు కనిపించలేదు. సమీక్షలో ఆఫ్​ స్టంప్స్​కు బంతి తాకినట్లు చూపించింది. కానీ, అంపైర్స్​ కాల్​ మూలంగా ఆ నిర్ణయం ఇంగ్లాండ్​కు అనూకూలంగా మారింది. దీంతో అంపైర్​పై టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యి.. నితిన్​ మేనన్​తో గొడవకు దిగాడు.

ఉల్లంఘనకు శిక్ష

ఐసీసీ రాజ్యాంగంలో ఆర్టికల్​ 2.8 ప్రకారం మైదానంలో అంపైర్లతో వాగ్వివాదం పెట్టుకున్నా.. లేదా అంపైర్​ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గొడవకు దిగినా.. ఈ నిబంధన కింద సదరు క్రికెటర్​పై ఐసీసీ చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఈ నేపథ్యంలో అంపైర్​తో గొడవకు దిగిన కోహ్లీ.. శిక్షగా లెవల్​-1 నుంచి లెవల్​-2 ఆటగాడిగా దిగజారడం సహా నాలుగు డీ-మెరిట్​ పాయింట్లు ఇచ్చే అవకాశం ఉంది. కోహ్లీ పేరు మీద ఇప్పటికే రెండు డీ-మెరిట్​ పాయింట్లు ఉన్నాయి. 24 నెలల్లో ఈ డీ-మెరిట్​ పాయింట్లు నాలుగుకు చేరితే సదరు క్రికెటర్​ ఒక టెస్టు లేదా రెండు వన్డే/టీ20లకు సస్పెండ్​కు గురయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'టెస్టు ఫార్మాట్​కు అండగా పింక్​-బాల్​ క్రికెట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.