ఎప్పుడూ క్రికెట్ మైదానంలో పరుగులూ, శతకాలతో రికార్డులు నెలకొల్పే టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఆ మాధ్యమంలో ఏకంగా 100 మిలియన్ల ఫాలోవర్స్ మైలురాయిని చేరుకున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల ఫాలోవర్స్‌ను దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. అంతేకాకుండా అంతటి ఫాలోవర్స్ ఉన్న తొలి ఆసియన్‌గా, ఫుట్బాల్యేతర క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.
ఇదీ చూడండి: కోహ్లీపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ప్రశంసలు