డీసీ కామిక్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'జస్టిస్ లీగ్' జాక్ స్నైడర్ కట్.. ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వినూత్నంగా స్పందించింది. సూపర్ హీరోలా ముఖాలను క్రికెటర్లతో మార్ఫింగ్ చేసి 'యునైట్ ది లీగ్' అని క్యాప్షన్ జోడించింది.
-
Unite the League 💪#SnyderCut pic.twitter.com/kNPI8simBg
— ICC (@ICC) March 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Unite the League 💪#SnyderCut pic.twitter.com/kNPI8simBg
— ICC (@ICC) March 18, 2021Unite the League 💪#SnyderCut pic.twitter.com/kNPI8simBg
— ICC (@ICC) March 18, 2021
ఇందులో.. ఆక్వామ్యాన్‌గా భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ ఉండగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను సూపర్‌మ్యాన్‌గా చూపించింది ఐసీసీ. ఇక బ్యాట్‌మ్యాన్‌గా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, సైబార్గ్గా వెస్టిండీస్ వన్డే జట్టు కెప్టెన్ పొలార్డ్ ఉన్నారు. వండర్ ఉమెన్‌గా అస్ట్రేలియా మహిళా జట్టు క్రికెటర్ అల్లైస్ పెర్రి ఉంది.
'జస్టిస్ లీగ్' సినిమా 2017లోనే విడుదలైంది. దిగ్గజ దర్శకుడు జాక్ స్నైడర్.. సినిమాలోని చాలా భాగం చిత్రీకరించారు. కాని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు. మరో దర్శకుడు ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. 'జాక్ స్నైడర్ కట్' కావాలంటూ అప్పటి నుంచి డీసీ అభిమానులు డిమాండ్ చేస్తూ వచ్చారు.
ఇదీ చూడండి: ప్రధాని మోదీకి విండీస్ ఆల్‌రౌండర్ రసెల్ కృతజ్ఞతలు