ETV Bharat / sports

వన్డేల్లో భారత కెప్టెన్ కోహ్లీ మరో ఘనత - kohli record

అద్భుత బ్యాట్స్​మన్​గా, సారథిగా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ వన్డేల్లో మరో మార్క్​ను అందుకున్నాడు. భారత్​ తరఫున 250 వన్డేలు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Virat Kohli 9th Indian to make 250 ODI appearances
వన్డేల్లో భారత కెప్టెన్ కోహ్లీ మరో ఘనత
author img

By

Published : Nov 29, 2020, 10:28 AM IST

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. దేశం తరఫున 250 వన్డేలు ఆడిన తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో పాల్గొని ఈ మార్క్​ను అధిగమించాడు.

2008 ఆగస్టు 18న శ్రీలంకతో మ్యాచ్​తో వన్డేల్లో విరాట్ అరంగేట్రం చేశాడు. వీటితో పాటు 86 టెస్టులు, 82 టీ20లు భారత్​ తరఫున ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 21 వేల పరుగులకు పైగా చేశాడు.

టీమ్​ఇండియా తరఫున ఎక్కువ వన్డేలు ఆడిన వారిలో దిగ్గజ సచిన్(463) అందరికంటే ముందున్నాడు. ఆ తర్వాత ధోనీ(347), రాహుల్ ద్రవిడ్(340), అజారుద్దీన్(334), సౌరభ్ గంగూలీ(308), యువరాజ్ సింగ్(301), అనిల్ కుంబ్లే(269) ఉన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే సచిన్(463), మహేల జయవర్ధనే(448), సనత్ జయసూర్య(445), కుమార సంగక్కర(404), అఫ్రిది(398), ఇంజిమామ్ ఉల్ హక్(378), రికీ పాంటింగ్(375).. ఈ జాబితాలో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.