ETV Bharat / sports

రెచ్చిపోయిన శార్దూల్‌: 57 బంతుల్లో 92 - సూర్యకుమార్ యాదవ్​ వార్తలు

విజయ్​ హజారె ట్రోఫీలో ముంబయి ఆల్​రౌండర్​ శార్దూల్ ఠాకూర్​​ సత్తాచాటాడు. కేవలం 57 బంతుల్లో 92 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకంగా మారాడు. మరోవైపు యువ బ్యాట్స్​మన్​ సూర్యకుమార్​ యాదవ్​ 91 పరుగులతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. దీంతో టోర్నీలోని చివరి లీగ్​ మ్యాచ్​లో హిమాచల్​ప్రదేశ్​ జట్టుపై 200 రన్స్​ తేడాతో ముంబయి ఘనవిజయం సాధించింది.

Vijay Hazare Trophy: Shardul shines as Mumbai beat Himachal by 200 runs
రెచ్చిపోయిన శార్దూల్‌: 57 బంతుల్లో 92
author img

By

Published : Mar 1, 2021, 10:49 PM IST

ముంబయి యువ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ రెచ్చిపోయాడు. విజయ్‌ హజారె వన్డే టోర్నీలో హిమాచల్‌ప్రదేశ్‌పై విధ్వంసం సృష్టించాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ కేవలం 57 బంతుల్లో 92 పరుగులు చేసి.. ఆరు బౌండరీలు, ఆరు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థిపై విజయంలో కీలకంగా నిలిచాడు.

మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 8 పరుగులకే కీలకమైన యశస్వీ జైశ్వాల్‌ (2), పృథ్వీషా (2), శ్రేయస్‌ అయ్యర్‌ (2) వికెట్లు చేజార్చుకుంది. మరికాసేపటికే సర్ఫరాజ్‌ ఖాన్‌ (11) విఫలమవ్వడం వల్ల 49/4తో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జట్టును ఆదుకొనేందుకు సూర్యకుమార్‌ యాదవ్‌ (91) రంగంలోకి దిగాడు. టీమ్‌ఇండియాకు ఎంపికైన అతడు ఆదిత్య తారె (83)తో కలిసి విధ్వంసం సృస్టించాడు. 15 బౌండరీలు బాది కేవలం 75 బంతుల్లో 91 పరుగులతో జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. 31 ఓవర్లో సూర్య ఔటయ్యాక తారెకు శార్దూల్‌ జత కలిశాడు. బ్రిస్బేన్‌లో మాదిరిగా ఇక్కడా సత్తా చాటాడు. ఆరో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. దాంతో ముంబయి స్కోరు 300 దాటేసింది.

ఇక 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్‌ 4 పరుగులకే 3 వికెట్లు నష్టపోయింది. పీహెచ్‌ సోలంకి (4/31), ఎస్‌జెడ్‌ ములాని (3/42), ధవళ్‌ కుల్‌కర్ణి (2/8) దెబ్బకొట్టడం వల్ల ఆ జట్టు 24.1 ఓవర్లకు 121కే ఆలౌటైంది. ఫలితంగా 200 పరుగుల తేడాతో ముంబయి భారీ విజయాన్ని నమోదు చేసింది.

లీగ్​ మ్యాచ్​ల ఫలితాలు

అయితే సోమవారం జరిగిన మ్యాచ్​ల్లో సౌరాష్ట్ర (233) పై సర్వీసెస్‌, చండీగఢ్‌ (241)పై జమ్ము కశ్మీర్‌ (245/2), బెంగాల్‌ (177)పై హరియాణా (178/5), మణిపుర్‌ (202)పై మేఘాలయ (303/8), అరుణాచల్‌ ప్రదేశ్‌ (285/7)పై నాగాలాండ్‌ (287/3), మిజోరం (160)పై అసోం (342/8), సిక్కిం (161/6)పై ఉత్తరాఖండ్‌ (306/8), పుదుచ్చేరి (196)పై మహారాష్ట్ర (333/4), రాజస్థాన్‌ (294)పై దిల్లీ (296/2) గెలుపొందాయి.

ఇదీ చూడండి: వారెవ్వా.. ఏం క్యాచ్​ గురూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.