విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఈ సీజన్‌కు తమ జట్టు సారథిని ప్రకటించింది ముంబయి. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్ పగ్గాలు అప్పజెప్పింది. వైస్‌కెప్టెన్‌గా పృథ్వీ షాను నియమించింది. 22మంది ఆటగాళ్లు ఉన్న ఈ జట్టులో యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తుషార్ దేశ్‌పాండేతో పాటు పలువురు ఆటగాళ్లు ఉన్నారు.
జట్టు: శ్రేయస్ అయ్యర్(సారథి), పృథ్వీ షా(వైస్‌కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, అఖిల్ హర్వాద్కర్, సర్ఫరాజ్ ఖాన్, చిన్మయి సుతార్, ఆదిత్య తారె, హార్దిక్ తామోర్, శివమ్ దూబె, ఆకాశ్ పర్కార్, అతిఫ్ అత్తర్వాలా, షామ్స్ ములాని, అథ్వారా అన్కోలేకర్, సైరాజ్ పాటిల్, సుజిత్ నాయక్, తానుష్ కొటియన్, ప్రశాంత్ సోలంకి, ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే, సిద్ధార్థ్ రౌత్, మోహిత్ అవస్థీ.
బరోడా జట్టుకు కూడా తమ జట్టు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. కృనాల్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసింది. కేథర్ దేవ్‌ధర్‌ను వైస్‌కెప్టెన్‌గా నియమించింది. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అజిత్ లెలె తెలిపారు.
జట్టు: కృనాల్ పాండ్య(సారథి), కేధర్ దేవ్‌ధర్(వైస్‌కెప్టెన్), ప్రత్యూష్ కుమార్, విష్ణు సోలంకి, అభిమన్యుసింగ్ రాజ్‌పుత్, స్మిత్ పటేల్, నినంద్ రథ్వా, అకటిత్ శెట్, కార్తిక్, లుక్మణ్ మెరివాలా, బాబాసఫీ పఠాన్, ధృవ్ పటేల్, భార్గవ్ భట్, భాను పనియా, చింతాల్ గాంధీ, పర్త్ కోహ్లీ, జ్యోస్నిల్ సింగ్, మితేష్ పటేల్, సోబ్ సోపారియా, శివాలిక్ శర్మ, ప్రదీవ్ యాదవ్, ప్రతీక్.
ఫిబ్రవరి 20 నుంచి మార్చి 14వరకు జరగనున్న ఈ టోర్నీ సూరత్, ఇందోర్, బెంగళూరు, జైపుర్, కోల్‌కతా, చెన్నైలో జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లను ఎలైట్ ఏ, బీ, సీ, డీ, ప్లేట్ గ్రూప్‌గా విభజించారు. ఓక్కో గ్రూప్‌లోని జట్లు తమ మ్యాచులను సదరు ప్రాంతాల్లో ఆడనున్నాయి. ఇందులో భాగంగా ఎలైట్ డీలో ఉన్న ముంబయి జట్టు తన మ్యాచులను జైపుర్‌లో.. బరోడా సూరత్‌లో ఆడనున్నాయి.
ఇదీ చూడండి: భారత పిచ్‌లపై రూట్ పరుగుల దాహం తీరనిది