ETV Bharat / sports

విజయ్​ హజారే ట్రోఫీలో అదిరే ఆరంభాలు - vijay hazare trophy

విజయ్​ హజారే ట్రోఫీ తొలి రోజే దేశవాళీ క్రికెటర్లు పండగ చేసుకున్నారు. భారీ శతకాలతో తమ సత్తా చాటారు. మధ్యప్రదేశ్​తో జరిగిన మ్యాచ్​లో ఝార్ఖండ్​ కెప్టెన్​ ఇషాన్​ కిషన్​ కేవలం 94 బంతుల్లోనే 173 పరుగులతో రెచ్చిపోయాడు. ఫలితంగా ఝార్ఖండ్​ 324 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

Vijay Hazare: Kishan stars in Jharkhand's mammoth win over Madhya Pradesh
విజయ్​ హజారే ట్రోఫీలో అదిరే ఆరంభాలు
author img

By

Published : Feb 20, 2021, 8:17 PM IST

విజయ్​ హజారే ట్రోఫీ తొలి రోజే పలువురు దేశవాళీ బ్యాట్స్​మెన్లు రెచ్చిపోయారు. రానున్న ఐపీఎల్​తో పాటు, ఇంగ్లాండ్​తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్​లలో అవకాశాలే లక్ష్యంగా శతకాలు బాదారు. మధ్యప్రదేశ్​తో జరిగిన మ్యాచ్​లో ఝార్ఖండ్​ కెప్టెన్​ ఇషాన్​ కిషన్​ భారీ సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా 324 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఝార్ఖండ్​ టీమ్​.

దంచికొట్టిన ఇషాన్​..

తొలుత బ్యాటింగ్​కు దిగిన కిషన్​ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. కెప్టెన్​ ఇషాన్​ కేవలం 94 బంతుల్లోనే 173 రన్స్​ చేసి.. జట్టు భారీ స్కోరుకు బీజం వేశాడు. ఇందులో 142 పరుగులు బౌండరీల ద్వారా వచ్చినవే కావడం విశేషం. అతనికి తోడు విరాట్​ సింగ్​, సుమిత్​ కుమార్​, అనుకుల్​ రాయ్​లు అర్ధ సెంచరీలతో సత్తా చాటారు.

అనంతరం 423 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్​ జట్టు కేవలం 98 స్కోరుకే ఆలౌటైంది. ఫలితంగా.. 324 పరుగుల తేడాతో గెలిచింది ఝార్ఖండ్​. 42 పరుగులు చేసిన అభిషేక్​ భండారి ఆ జట్టు టాప్​ స్కోరర్​. ముగ్గురు బ్యాట్స్​మెన్లు డకౌట్​ అయ్యారు. మిగతా వారు సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యారు. ఝార్ఖండ్​ బౌలర్​ వరుణ్​ ఆరోన్​ 6 వికెట్లతో కీలక ప్రదర్శన చేశాడు.

సంక్షిప్త స్కోర్లు:

ఝార్ఖండ్​: 422/9, 50 ఓవర్లు. (ఇషాన్​ కిషన్​ 173, అనుకుల్​ రాయ్​ 72, గౌరవ్​ యాదవ్​ 4/73)

మధ్యప్రదేశ్​: 98 ఆలౌట్​, 18.4 ఓవర్లు. (అభిషేక్​ భండారి 42, వెంకటేష్​ అయ్యర్​ 23, వరుణ్​ ఆరోన్​ 6/37, బాల్​ క్రిష్ణ 2/8)

త్రిపురతో జరిగిన మరో మ్యాచ్​లో హైదరాబాద్​ టీమ్​ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన హైదరాబాద్​.. నిర్ణీత ఓవర్లలో 349 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మయ్​ అగర్వాల్​, తిలక్​ వర్మలు మొదటి వికెట్​కు 166 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తిలక్​ వర్మ సెంచరీకు తోడు తన్మయ్​ అగర్వాల్​, హిమాలయ అగర్వాల్​, భావనాక సందీప్​లు మెరిశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన త్రిపుర జట్టు 236 పరుగులకు ఆలౌటైంది. బిక్రమ్​కుమార్​ దాస్​, మిలింద్​ కుమార్​లు హాఫ్​ సెంచరీలు చేసినప్పటికీ నిరాశ తప్పలేదు. 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన చామ మిలింద్​ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సంక్షిప్త స్కోర్లు:

హైదరాబాద్​: 349/5, 50 ఓవర్లు. (తిలక్​ వర్మ 156, తన్మయ్​ అగర్వాల్​ 86, రజత్​ డెయ్​ 45/2)

త్రిపుర: 236 ఆలౌట్​, 42 ఓవర్లు. (మిలింద్​ కుమార్ 67, బిక్రమ్​కుమార్ దాస్​ 65, చామ మిలింద్​ 43/5, భావనాక సందీప్​ 37/2)

విదర్భ, ఆంధ్రల మధ్య జరిగిన మరో మ్యాచ్​లో.. 332 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర ఛేదించింది. విదర్భ ఇన్నింగ్స్​లో ఫైజ్​ ఫజల్​, యష్​ రాఠోడ్​లు సెంచరీలతో విదర్భ భారీ స్కోరు చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. ఆంధ్ర జట్టులో రికీ భుయ్ సమయోచిత శతకానికి తోడు హనుమ విహారి, నితీశ్​ కుమార్​ రెడ్డిలు అర్ధ సెంచరీలు చేశారు. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆంధ్ర విజయం సాధించింది.

సంక్షిప్త స్కోర్లు:

విదర్భ: 331/6, 50 ఓవర్లు. (ఫైజ్​ ఫజల్​ 100, యష్​ రాఠోడ్ 117, స్టీఫెన్​ 66/3, గిరినాథ్​ రెడ్డి 79/2)

హైదరాబాద్​: 332/7, 49.2 ఓవర్లు. (రికీ భుయ్​ 101 నాటౌట్, హనుమ విహారి 65, దర్శన్​ నల్కండే 76/3, ఆదిత్య ఠాక్రే 76/2) ​ ​

ఇతర మ్యాచ్​ల ఫలితాలు:

  • గ్రూప్​-ఏలోని ఛత్తీస్​గఢ్​, గుజరాత్​ల మధ్య జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
  • గ్రూప్​-ఏలోని గోవాతో జరిగిన మ్యాచ్​లో బరోడా 5 వికెట్ల తేడాతో విజయం కైవసం చేసుకుంది.
  • గ్రూప్​-బీలోని పంజాబ్​తో జరిగిన మరో మ్యాచ్​లో తమిళనాడు టీమ్​ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
  • గ్రూప్​-సీలోని కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​ల మధ్య జరిగిన మ్యాచ్​లో ఉత్తర్​ప్రదేశ్​ 9 పరుగుల తేడాతో వీజేడీ పద్ధతిలో విజయం సాధించింది.
  • గ్రూప్​-సీలోని ఒడిశా, కేరళ మధ్య జరిగిన మ్యాచ్​లో కేరళ 34 పరుగుల తేడాతో వీజేడీ పద్ధతిలో గెలుపొందింది.
  • గ్రూప్​-సీలోని బిహార్​, రైల్వేస్​ మధ్య జరిగిన మరో మ్యాచ్​లో రైల్వేస్​ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇదీ చదవండి: 'మాకు కావాల్సిన వాళ్లే దొరికారు- మరింత ముందుకెళ్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.