టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ చిత్రాన్ని ఉపయోగించి చేసిన ట్వీట్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు తొలగించారు. అభిమానుల నుంచి విమర్శలు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు చేసిన ట్వీట్‌పై కొందరు నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచే ఉద్దేశంతో విరాట్ వికెట్లను వదిలేసి ఆడాడు. ఆదిల్ రషీద్ వేసిన బంతిన బలంగా బాదబోయాడు. అయితే బ్యాటుకు తగిలిన బంతి నేరుగా లాంగాఫ్‌లో జోర్డాన్ వద్దకు వెళ్లింది. అతడు బంతిని సులభంగా ఒడిసిపట్టాడు. శ్రేయస్ మినహా మిగతా ఆటగాళ్లు విఫలం కావడం వల్ల టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
-
हेलमेट लगाना ही काफ़ी नहीं है!
— Uttarakhand Police (@uttarakhandcops) March 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
पूरे होशोहवास में गाड़ी चलाना ज़रूरी है,
वरना कोहली की तरह आप भी ज़ीरो पर आउट हो सकते हैं. #INDvEND #ViratKohli pic.twitter.com/l66KD4NMdG
">हेलमेट लगाना ही काफ़ी नहीं है!
— Uttarakhand Police (@uttarakhandcops) March 12, 2021
पूरे होशोहवास में गाड़ी चलाना ज़रूरी है,
वरना कोहली की तरह आप भी ज़ीरो पर आउट हो सकते हैं. #INDvEND #ViratKohli pic.twitter.com/l66KD4NMdGहेलमेट लगाना ही काफ़ी नहीं है!
— Uttarakhand Police (@uttarakhandcops) March 12, 2021
पूरे होशोहवास में गाड़ी चलाना ज़रूरी है,
वरना कोहली की तरह आप भी ज़ीरो पर आउट हो सकते हैं. #INDvEND #ViratKohli pic.twitter.com/l66KD4NMdG
వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్ పోలీసులు విరాట్ చిత్రాన్ని ఉపయోగించుకున్నారు. 'హెల్మెట్ ఒక్కటే సరిపోదు. పూర్తి ధ్యాసతో డ్రైవింగ్ చేయడం అత్యంత ఆవశ్యకం. లేకపోతే కోహ్లీ మాదిరిగానే మీరూ డకౌట్ అవుతారు' అని హిందీలో పోస్ట్ చేశారు. పోలీసులు చేసిన ట్వీట్‌పై అభిమానులు మండిపడ్డారు. చేసిన ట్వీట్ టీమ్‌ఇండియా కెప్టెన్‌ను అవమానించేలా ఉందంటూ కొందరు.. పోస్ట్ చేసిన చిత్రానికి, ట్వీట్‌కు సంబంధం లేదని మరికొందరు విమర్శించారు. దీంతో ట్వీట్ తొలగించక తప్పలేదు!
ఇదీ చూడండి: కోహ్లీ ఔట్‌ను ఉత్తరాఖండ్ పోలీసులు ఎలా వాడుకున్నారంటే?