పరిమిత ఓవర్ల అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేస్తున్న నితిన్ మేనన్(భారత్).. టెస్టుల్లోనూ ఇదే బాధ్యతలు నిర్వర్తించేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్‌లో జరగనున్న వెస్టిండీస్-అఫ్గానిస్థాన్ టెస్టు సిరీస్‌కు ఇతడు అంపైర్‌గా నియమితుడయ్యాడు.
మాజీ అంపైర్ నరేంద్ర మేనన్ తనయుడు నితిన్ మేనన్. మధ్య ప్రదేశ్ జట్టు తరఫున అండర్-16, అండర్-19, అండర్-23, లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. 2006లో బీసీసీఐ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణుడై దేశవాళీ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసేందుకు అర్హత సాధించాడు.
-
NEWS📰: Umpire Nitin Menon is all set for his Test debut
— BCCI (@BCCI) September 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Son of a former international umpire, Nitin has been appointed as an on-field umpire for the Afghanistan-West Indies Test match.
Details - https://t.co/BkdSPy1SkQ pic.twitter.com/ndzD9o9OTf
">NEWS📰: Umpire Nitin Menon is all set for his Test debut
— BCCI (@BCCI) September 2, 2019
Son of a former international umpire, Nitin has been appointed as an on-field umpire for the Afghanistan-West Indies Test match.
Details - https://t.co/BkdSPy1SkQ pic.twitter.com/ndzD9o9OTfNEWS📰: Umpire Nitin Menon is all set for his Test debut
— BCCI (@BCCI) September 2, 2019
Son of a former international umpire, Nitin has been appointed as an on-field umpire for the Afghanistan-West Indies Test match.
Details - https://t.co/BkdSPy1SkQ pic.twitter.com/ndzD9o9OTf
ఇప్పటివరకు 57 ఫస్ట్ క్లాస్, 22 అంతర్జాతీయ వన్డే, తొమ్మిది టీ20, 40 ఐపీఎల్ మ్యాచ్‌లకు అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు నితిన్. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే కృషి చేస్తున్నాడు. తనపై నమ్మకం ఉంచినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు.
ఇవీ చూడండి.. ధోతీ-కుర్తాతో క్రికెట్ మ్యాచ్- సంస్కృతంలో కామెంట్రీ