ETV Bharat / sports

'నాపై ఉన్న నిషేధాన్ని రద్దు చేయండి'

author img

By

Published : Aug 21, 2020, 10:09 AM IST

పాకిస్థాన్​ క్రికెటర్​ ఉమర్​ అక్మల్​.. తనపై ఉన్న 18 నెలల నిషేధాన్ని రద్దు చేయాలని కోరుతూ కోర్టు ఆఫ్​ ఆర్బిట్రేషన్​ ఫర్ స్పోర్ట్స్​ (సీఏఎస్​)లో అప్పీల్​ చేశాడు. తాను స్పాట్​ ఫిక్సింగ్​కు​ పాల్పడినట్లు ఆధారాలు సేకరించడంలో పాక్​ క్రికెట్​ బోర్డు విఫలమైనందున ఆ నిషేధాన్ని రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరాడు.

Umar Akmal files appeal to overturn 18-month ban
నాపై 18 నెలల నిషేధాన్ని రద్దు చేయండి: అక్మల్​

అవినీతి ఆరోపణలతో ఉమర్​ అక్మల్​పై గతంలో మూడేళ్ల నిషేధాన్ని విధించింది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ). అయితే దానికి సంబంధించిన ఆధారాలను సేకరించడంలో బోర్డు విఫలమవ్వడం వల్ల లుసానేలోని కోర్టు ఆఫ్​ ఆర్బిట్రేషన్​ ఫర్​ స్పోర్ట్స్​ (సీఏఎస్​)ను ఆశ్రయించాడు అక్మల్​. తనపై ఉన్న 18 నెలల నిషేధాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో అభ్యర్థన దాఖలు చేశాడు. ఉమర్​కు వ్యతిరేకంగా ఎలాంటి రుజువులు లేకపోవడం వల్ల నిషేధాన్ని రద్దు చేయాలని క్రికెటర్​ తరపు న్యాయవాది వాదించారు.

"ఉమర్​ అక్మల్​కు వ్యతిరేకంగా వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. విచారణ మొత్తం ఫోన్​లోనే జరిగింది. వారు చేస్తున్న ఆరోపణలను రుజువు చేయడానికి కనీసం బ్యాంకు లావాదేవీలు కూడా లేవు."

-ఉమర్​ అక్మల్​ తరపు న్యాయవాది

ఫిబ్రవరిలో జరిగిన పాకిస్థాన్​ సూపర్​లీగ్​లో స్పాట్​ ఫిక్సింగ్​కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఏప్రిల్​లో ఉమర్​ అక్మల్​పై మూడేళ్ల పాటు నిషేధాన్ని విధించింది పీసీబీ. బోర్డు స్వతంత్ర న్యాయాధికారిగా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి​ జస్టిస్​ ఫకీర్​ ముహమ్మద్​ ఈ నిషేధాన్ని 18 నెలలకు కుదించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.