చెన్నై సూపర్ కింగ్స్‌పై ప్రశంసలు కురిపించాడు ఆ జట్టు ఆటగాడు షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్). ధోనీ నాయకత్వంలో ఆడటం గొప్పగా భావిస్తున్నట్లు చెప్పాడు. సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం దుబాయ్ చేరకుంది చెన్నై జట్టు. ప్రస్తుతం ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు వాట్సన్. ఇందులో ధోనీ, అతడు బ్యాట్‌తో బంతులను వరుసగా బాదుతూ కనిపించారు. "39ఏళ్ల వయసులోనూ మాకు నచ్చిన దాన్ని చేస్తున్నాము" అని వ్యాఖ్య రాసుకొచ్చాడు.
-
At the ripe old age of 39 .... just two old guys doing what we love @ChennaiIPL 😊😊💕💕 pic.twitter.com/GM8AQlDgS6
— Shane Watson (@ShaneRWatson33) September 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">At the ripe old age of 39 .... just two old guys doing what we love @ChennaiIPL 😊😊💕💕 pic.twitter.com/GM8AQlDgS6
— Shane Watson (@ShaneRWatson33) September 13, 2020At the ripe old age of 39 .... just two old guys doing what we love @ChennaiIPL 😊😊💕💕 pic.twitter.com/GM8AQlDgS6
— Shane Watson (@ShaneRWatson33) September 13, 2020
"సీఎస్కేతో ఆడటం నా అదృష్టంగా భావిస్తా. యాజమాన్యం జట్టును నడిపించే విధానం చాలా బాగుంటుంది. ఇది నాకు ఓ గొప్ప అనుభూతిలాంటింది. ఇంతకముందు నేను రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాను. ఆ ఫ్రాంచైజీ కూడా ఎంతో గొప్పది. ఆటగాళ్లను బాగా చూసుకుంటారు. మొత్తంగా సీఎస్కే, ఆర్ఆర్ రెండు జట్లు మైదానం లోపల, బయట చాలా చక్కగా ఉంటాయి."
-షేన్ వాట్సన్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్.
2008లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు షేన్ వాట్సన్. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ సత్తాచాటాడు. 2018లో సీఎస్కే తరఫున ఓపెనింగ్ బాధ్యతను నిర్వర్తించాడు. అదే ఏడాది జట్టు ట్రోఫీని సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
సెప్టెంబరు 19నుంచి నవంబరు 10వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని సీఎస్కే, రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి.
ఇదీ చూడండి ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు రుతురాజ్ దూరం!