ETV Bharat / sports

ఐపీఎల్​ 2020: ప్రాక్టీసులో వికెట్​ విరగ్గొట్టిన బౌల్ట్​ - ట్రెంట్​ బౌల్ట్ న్యూస్​

ఐపీఎల్​ కోసం ప్రాక్టీసులో ఉన్న ముంబయి ఇండియన్స్​ బౌలర్​ ట్రెంట్​ బౌల్ట్​.. తనదైన వేగంతో వికెట్​ను రెండు ముక్కలు చేశాడు. అతడు బౌలింగ్​ చేస్తున్న వీడియోను సోషల్​మీడియాలో షేర్​ చేసింది ఆ జట్టు యాజమాన్యం.

Trent Boult Breaks A Stump Into Two Pieces In Mumbai Indians Training Session
ఐపీఎల్​ 2020: ప్రాక్టీసులో వికెట్​ను విరగొట్టిన ట్రెంట్ బౌల్ట్​
author img

By

Published : Sep 13, 2020, 11:36 AM IST

ఐపీఎల్​ కోసం ముంబయి ఇండియన్స్​ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాక్టీసులో ఆటగాళ్ల వీడియోలను సోషల్​మీడియాలో పంచుకుంటూ.. అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది ఆ జట్టు యాజమాన్యం. ఈ ఏడాది జట్టులోకి కొత్తగా ఎంపికైన ట్రెంట్​ బౌల్ట్​ విధ్వంసకర బౌలింగ్​ వీడియోను సోషల్​మీడియాలో షేర్​ చేసింది.

అందులో బౌల్ట్​ వేసిన బంతి తాకి వికెట్​ రెండు ముక్కలుగా విరిగి పోయింది. ఈ వీడియోకు 'క్లీన్​ బౌల్ట్​!' అనే క్యాప్షన్​తో షేర్​ చేసింది ముంబయి ఇండియన్స్.

బౌలింగ్​ లైనప్​ ధృఢంగా..

గతేడాది దిల్లీ క్యాపిటల్స్​ తరఫున ప్రాతినిధ్యం వహించిన ట్రెంట్​ బౌల్ట్​.. 13వ సీజన్​ వేలంలో అతడిని ముంబయి ఇండియన్స్​ జట్టు సొంతం చేసుకుంది. ఐపీఎల్​ చరిత్రలో ముంబయి ఇండియన్స్​ జట్టు బౌలింగ్​ లైనప్​ ఇప్పటి వరకూ చాలా ధృఢంగా ఉంది. ఇందులో అనేక మంది ప్రపంచస్థాయి బౌలర్స్​ పాలుపంచుకోగా.. శ్రీలంకకు చెందిన లసిత్​ మలింగ అత్యంత విజయవంతమైన బౌలర్​గా పేరొందాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుత ఐపీఎల్​ నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించాడు మలింగ.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్​ ప్రారంభం కానుంది. టోర్నీలోని తొలి మ్యాచ్​లో.. గతేడాది ఫైనల్​కు చేరిన ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​కింగ్స్​ తలపడనున్నాయి. ముంబయి ఖాతాలో ఇప్పటివరకు నాలుగు ఐపీఎల్​ ట్రోఫీలు ఉండగా.. సీఎస్​కే మూడు ఐపీఎల్ కప్​లను గెలుపొందింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.