ETV Bharat / sports

పాంచ్​ పటాకా: ఐపీఎల్ చరిత్రలో థ్రిల్లింగ్ 'సూపర్ ఓవర్​'లు

author img

By

Published : Apr 14, 2020, 7:32 AM IST

ఐపీఎల్​ మ్యాచ్​లంటే అభిమానులకు పండగే. కళ్లు చెదిరే బౌండరీలు, బౌలర్ల మ్యాజిక్, ఫీల్డర్ల విన్యాసాలతో ఫ్యాన్స్​కు బోలెడంత మజా దొరుకుతుంది. అలాంటిది సూపర్ ఓవర్​ అంటే ఆ జోష్​ తారాస్థాయికి చేరుకుంటుంది. ఐపీఎల్ చరిత్రలో అలాంటి టాప్-5 సూపర్ ఓవర్ మ్యాచ్​లపై ఓ లుక్కేద్దాం.

ఐపీఎల్
ఐపీఎల్

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​.. 2008లో ప్రారంభమై విశేష ప్రజాదరణ దక్కించుకుంది. యువ క్రికెటర్లకు సీనియర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే అవకాశం కల్పించింది. భారత క్రికెట్​ రూపురేఖలు మార్చిన ఈ మెగాటోర్నీ.. యంగ్ టాలెంట్​కు బాటలు వేసింది. ఏటా నిర్వహించే దాదాపు 50 రోజుల ఈ సంబరంలో.. ప్రతి మ్యాచ్ అభిమానులకు మజానిచ్చింది. ఇందులో సూపర్ ఓవర్​లు మరింత ప్రత్యేకం. గెలుపు కోసం రెండు జట్ల పడే ఆరాటానికి.. ఉత్కంఠ, సందడి తోడయ్యే సందర్భమది. అందుకే ఆ మ్యాచ్​లు అభిమానులను కట్టిపడేస్తాయి. అలాంటి టాప్-5 సూపర్ ఓవర్ మ్యాచ్​లపై ఓ లుక్కేద్దాం.

దిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్​కతా నైట్​రైడర్స్ (2019)

ఈ మ్యాచ్​లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. రెండు జట్లకు ఈ మ్యాచ్​ పాయింట్లు కీలకం కావడం వల్ల అభిమానుల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్​కతా 185 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 28 బంతుల్లో 62 పరుగులతో ఆండ్రూ రసెల్ విధ్వంసం సృష్టించాడు.

భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ జట్టు దీటుగానే బదులిచ్చింది. ఓపెనర్ పృథ్వీ షా 99 పరుగులతో చెలరేగడం వల్ల మ్యాచ్​ దిల్లీదే అనుకున్నారంతా. కానీ చివర్లో హనుమ విహారి, కొలిన్ ఇన్​గ్రామ్ బ్యాట్​ను ఝులిపించడంలో విఫలమవడం వల్ల మ్యాచ్​ టైగా ముగిసింది. ఫలితంగా మ్యాచ్​ సూపర్ ఓవర్​కు దారితీసింది.

సూపర్ ఓవర్​లో కోల్​కతా బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వికెట్ తీయడమే కాకుండా కేవలం 10 పరుగులే ఇచ్చాడు. రైడర్స్ విజయం సునాయాసమే అనుకున్నారు. కానీ క్యాపిటల్స్ బౌలర్ రబాడ మ్యాజిక్ చేశాడు. మొదటి బంతికి రసెల్ ఫోర్ కొట్టడం వల్ల విజయ సమీకరణం 5 బంతుల్లో 7 పరుగులకు వచ్చింది. కానీ రబాడ మిగిలిన ఐదు బంతులను కట్టుదిట్టంగా విసరడం వల్ల... ఫలితం మారిపోయింది. దిల్లీ మూడు పరుగుల​ తేడాతో విజయం సాధించింది.

IPL history
ఐపీఎల్ చరిత్రలో థ్రిల్లింగ్ సూపర్ ఓవర్ మ్యాచ్​లు

ముంబయి ఇండియన్స్ వర్సెస్ సన్​రైజర్స్ హైదరాబాద్ (2019)

హైదరాబాద్-ముంబయి మధ్య ఈ సీజన్​లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి.. 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. డికాక్ 58 బంతుల్లో 69 పరుగులతో రాణించాడు. లక్ష్య ఛేదనలో హైదరాబాద్​కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా, గప్తిల్ మెరిశారు. మనీశ్ పాండే 71 పరుగులతో నాటౌట్​గా నిలవడం వల్ల మ్యాచ్​ టైగా ముగిసింది.

సూపర్ ఓవర్​లో బ్యాటింగ్​కు వచ్చిన హైదరాబాద్​కు మొదటి బంతికే షాక్ తగిలింది. ఫామ్​లో కనిపించిన పాండే.. బుమ్రా బౌలింగ్​లో డకౌట్​గా వెనుదిరిగాడు. మహ్మద్ నబీ సిక్సర్​ వల్ల ముంబయి ముందు 9 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది సన్​రైజర్స్. ఇలాంటి ఉత్కంఠభరిత సమయంలో బంతిని రషీద్ ఖాన్​కు అందించాడు కెప్టెన్ విలియమ్సన్. కానీ ముంబయి ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య మొదటి బంతికే సిక్స్​ బాది రోహిత్​సేనకు విజయాన్నందించాడు.

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (2015)

అజింక్యా రహానే 74 (54 బంతుల్లో) పరుగులతో మెరవడం వల్ల రాజస్థాన్​.. పంజాబ్​ ముందు 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. షేన్ వాట్సన్ 45 పరుగులతో రహానేకు మద్దతిచ్చాడు. అయితే లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కింగ్స్​కు ఆదిలోనే గట్టిదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. కానీ షాన్ మార్ష్ 65 (40బంతుల్లో) పరుగులకు తోడు డేవిడ్ మిల్లర్ 54(30) మెరుపు ఇన్నింగ్స్​తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ఆఖరు బంతికి అక్షర్ పటేల్ బౌండరీ బాదడం వల్ల మ్యాచ్​ టై అయింది.

సూపర్ ఓవర్​లో మొదటి బంతికే పంజాబ్ ఆటగాడు మిల్లర్.. క్రిస్ మోరిస్ బౌలింగ్​లో డకౌటయ్యాడు. కానీ మార్ష్ వరుసగా మూడు బౌండరీలు బాది రాజస్థాన్ ముందు 15 పరుగుల లక్ష్యాన్ని ఉంచాడు. మొదటి బంతికే వాట్సన్​ను ఔట్ చేశాడు పంజాబ్ బౌలర్ మిచెల్ జాన్సన్. తర్వాత ఫాల్క్​నర్ రనౌట్ కావడం వల్ల కింగ్స్​ విజయం సాధించింది.

కోల్​కతా నైట్​రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (2014)

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 152 పరుగులు చేసింది. రహానే 59 బంతుల్లో 72 రన్స్​తో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అయితే కోల్​కతా బ్యాట్స్​మెన్​కు అంత సులువుగా పరుగులు ఇవ్వలేదు రాయల్స్ బౌలర్లు. ముఖ్యంగా జేమ్స్ ఫాల్క్​నర్ 11 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి కోల్​కతాకు సవాల్ విసిరాడు. ఛేదనలో కెప్టెన్ గంభీర్ 45 (44బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. చివర్లో షకిబ్ అల్ హసన్ 18 బంతుల్లో 29 పరుగులతో చక్కటి ఇన్నింగ్స్​ ఆడటం వల్ల మ్యాచ్​ టై అయింది.

సూపర్​ ఓవర్​లో బ్యాటింగ్​కు దిగిన కోల్​కతా.. మనీశ్​ పాండే సిక్సర్​ బాదడం వల్ల 11 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి రాజస్థాన్ ముందుంచింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్​ను కట్టడి చేశాడు సునీల్ నరేన్. మొదటి మూడు బంతులకు ఎలాంటి పరుగులు ఇవ్వలేదు. కానీ నాలుగో బంతికి బౌండరీ బాదిన వాట్సన్​ తర్వాత అదే జోరు కొనసాగించాడు. చివరికి సూపర్ ఓవర్ టైగా ముగియడం వల్ల... బౌండరీ కౌంట్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ దిల్లీ డేర్ డెవిల్స్ (2013)

ఈ సీజన్​ 21వ మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్) హోరాహోరీగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన డీడీ 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు సాధించింది. సెహ్వాగ్ (25), జయవర్ధనే (28), కేదార్ జాదవ్ (29) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో కోహ్లీ (65), డివిలియర్స్ (39) రాణించడం వల్ల ఆర్సీబీదే విజయం అనుకున్నారు. కానీ వారిద్దరూ ఔటయ్యాక ఆట గమనం మారిపోయింది. చివర్లో రవి రాంపాల్ 7 బంతుల్లో 12 పరుగులు చేయడం వల్ల మ్యాచ్​ టైగా ముగిసింది.

సూపర్ ఓవర్లో దిల్లీ బౌలర్ ఉమేశ్​ యాదవ్​కు తన పవరేంటో చూపించాడు డివిలియర్స్. రెండు భారీ సిక్సర్లు బాది 15 పరుగుల లక్ష్యాన్ని వారి ముందుంచాడు. కానీ లక్ష్య ఛేదనలో దిల్లీ ప్రారంభంలోనే వార్నర్ వికెట్ కోల్పోయింది. తర్వాత ఇర్ఫాన్ పఠాన్ రెండు ఫోర్లు, ఓ సిక్సు బాది గాడిలోకి తెచ్చినా.. రాయల్స్​ గెలుపును ఆపలేకపోయాడు. ఈ మ్యాచ్​లో కోహ్లీసేన 4 పరుగులతో గెలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.