ఈ ఏడాది క్రికెట్ అభిమానులు మర్చిపోలేనిది. ఏదో అద్భుతం జరిగిందని కాదు.. అసలు ఏం జరగలేదు కాబట్టి. కరోనా కారణంగా మార్చి తర్వాత ఏ ఒక్క టోర్నీ నిర్వహణ సాధ్యం కాలేదు. మైదానాల్లో సందడి లేక, టీవీ, మొబైల్స్‌లో క్రికెట్‌కు సంబంధించిన అఫ్డేట్స్ లేక ఫ్యాన్స్ నిరాశచెందారు. కానీ కరోనా ప్రారంభానికి ముందు, లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేశాక మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఊపందుకున్నాయి. అభిమానులకు కాస్త ఊరటను కల్పించాయి. ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో చేదు అనుభవాల నడుమ ఈ ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో జరిగిన కొద్ది టెస్టు మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు సాధించిన టాప్-5 బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం.
5. జాస్ బట్లర్ (ఇంగ్లాండ్) -497 రన్స్
ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జాస్ బట్లర్‌కు ఈ ఏడాది మరిచిపోలేనిది. సుదీర్ఘ ఫార్మాట్లో ఈ ఏడాది ఇతడు 38.23 సగటుతో 497 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలమైనా.. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టుల్లో మంచి ప్రదర్శన చేశాడు.
4. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)-498 పరుగులు
ఈ ఏడాది కేవలం 4 టెస్టులు మాత్రమే ఆడాడు కేన్ విలియమ్సన్. 83 సగటుతో 498 పరుగులు చేశాడు. భారత్‌తో జరిగిన టెస్టులో 89 పరుగులతో జట్టుకు విజయాన్నందించి ఈ ఏడాదిని గొప్పగా ప్రారంభించాడు. తర్వాత రెండు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైనా, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 251 పరుగులతో సత్తాచాటాడు. ఇదే ఇతడి కెరీర్ ఉత్తమం. తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులోనూ సెంచరీ చేశాడు.

3. జాక్ క్రాలే (ఇంగ్లాండ్)-580 రన్స్
ఈ ఏడాది ఇంగ్లాండ్ తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడిన క్రాలే 580 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 66 పరుగులతో ఆకట్టుకున్న ఇతడు, తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగులు చేశాడు. చివరగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 267 పరుగులతో మారథాన్ ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టినీ ఆకర్షించాడు. కానీ ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

2. డామ్ సిబ్లే (ఇంగ్లాండ్)-615 రన్స్
ఇంగ్లాండ్‌కు మరో వర్ధమాన ఆటగాడిగా వెలుగొందుతున్నాడు సిబ్లే. గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇతడు ఈ ఏడాది 9 మ్యాచ్‌లు ఆడి 615 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.

1. బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)-641 రన్స్
పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఆడకపోయినా ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. మొత్తం ఈ ఏడాది ఏడు టెస్టులు ఆడిన ఇతడు 58.27 సగటుతో 641 పరుగులు చేశాడు. కానీ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఇతడు కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.
