శ్రీలంక ఆల్‌రౌండర్ తిసారా పెరీరా సరికొత్త రికార్డును నమోదు చేశాడు. దేశవాళీ క్రికెట్లో భాగంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఏ ఫార్మాట్లోనైనా ఈ ఫీట్ సాధించిన తొలి లంక క్రికెటర్‌గా నిలిచాడు.
పనగోడా వేదికగా జరిగిన ఆర్మీ శ్రీలంక-బ్లూమ్‌ఫీల్డ్ మ్యాచ్‌లో పెరీరా ఈ ఘనత సాధించాడు. కేవలం 13 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొత్తంగా 8 సిక్స్‌లు బాదిన కొట్టిన తిసారా.. వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో లంక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2005లో లంక ప్లేయర్ వీరరత్నే 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు.
-
WATCH: Thisara Perera hits 6️⃣ sixes💥in an over💪https://t.co/6kvgdx1wqI @PereraThisara
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">WATCH: Thisara Perera hits 6️⃣ sixes💥in an over💪https://t.co/6kvgdx1wqI @PereraThisara
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 29, 2021WATCH: Thisara Perera hits 6️⃣ sixes💥in an over💪https://t.co/6kvgdx1wqI @PereraThisara
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 29, 2021
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు సాధించిన 9వ ఆటగాడు పెరీరా. అంతకుముందు గార్ఫీల్డ్ సోబెర్స్, రవిశాస్త్రి, హెర్షల్లె గిబ్స్, యువరాజ్ సింగ్, రాస్ విటెలెయ్, హజ్రాతుల్లా జాజాయ్, లియో కార్టర్, కీరన్ పొలార్డ్ అతడి కంటే ముందున్నారు.
ఇదీ చదవండి: ఐపీఎల్: ముంబయి జట్టులో కలిసిన రోహిత్, పాండ్య