టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ వన్డే ఆటగాళ్ల జాబితా తీస్తే ముందువరుసలో ఉంటాడు. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తాడు. స్కోర్ బోర్డుపై బౌండరీలనే పరుగులు పెట్టిస్తాడు. అతడాడే షాట్లలో కచ్చితత్వం ఎంత ఉంటుందో కళాత్మకం అంతే చక్కగా ఉంటుంది. రోహిత్ పేరు కాస్తా 'రోహిట్', 'హిట్‌మ్యాన్'గా మారిందంటేనే అతడి ఆట ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ చరిత్రలో తనకంటే పలువురు గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఎదిగినా.. వాళ్లెవరికీ సాధ్యంకాని రికార్డును తన పేరిట వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఎంత పెద్ద బ్యాట్స్‌మన్‌కైనా ద్విశతకం జీవితకాల కలగానే ఉంటుంది. అలాంటిది ఈ హిట్‌మ్యాన్ నాలుగేళ్లలో మూడుసార్లు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. రోహిత్ ఆ ఘనత సాధించి ఆదివారానికి(డిసెంబరు 13) మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఒకసారి ఆ ఇన్నింగ్సులను గుర్తు చేసుకుందాం..
ఆస్ట్రేలియాపై మొదలెట్టి..
తొలుత హిట్‌మ్యాన్ వన్డేల్లో ద్విశతకం సాధించింది 2013లో. అది కూడా ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టుపై. అప్పుడా జట్టు భారత పర్యటన సందర్భంగా నవంబర్ 2న చిన్నస్వామి స్టెడియం బెంగళూరులో జరిగిన ఏడో వన్డేలో రోహిత్ రెచ్చిపోయాడు. టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్ చేయగా 383/6 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శిఖర్ ధావన్(60; 57 బంతుల్లో 9x4)తో కలిసి హిట్‌మ్యాన్ (209; 158 బంతుల్లో 12x4, 16x6) బౌండరీల మోత మోగించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించాడు. ధావన్ ఔటయ్యాక రైనా(28), ధోనీ(62)తో విలువైన భాగస్వామ్యాలు జోడించాడు. ఇక ఛేదనలో జేమ్స్ ఫాల్కనర్(116; 73 బంతుల్లో 11x4, 6x6) శతకం బాదడంతో ఆస్ట్రేలియా 326 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌తోనే రోహిత్ 'హిట్‌మ్యాన్'గా మారాడు.
రోహిత్ స్కోర్ కన్నా లంక తక్కువ..
ఇక వన్డేల్లో ఎంత గొప్ప బ్యాట్స్‌మన్‌కైనా ఒక జట్టుపై ఒకసారి ద్విశతకం బాదాలంటేనే ఊహకందని విషయం. అలాంటిది రోహిత్ ‘సూపర్‌హిట్’గా మారి శ్రీలంకపై రెండుసార్లు దండయాత్ర చేశాడు. ఆస్ట్రేలియాపై అద్వితీయ ఇన్నింగ్స్ ఆడిన మరుసటి సంవత్సరమే మరో మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. ఇది వన్డే క్రికెట్ చరిత్రలో ‘న భూతో.. న భవిష్యతి’. 2014 శ్రీలంక.. భారత పర్యటన సందర్భంగా నవంబర్ 13న కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో రోహిత్(264; 173 బంతుల్లో 33x4, 9x6) విశ్వరూపం చూపించాడు. అతడికి విరాట్ కోహ్లీ(66; 64 బంతుల్లో 6x4) సహకరించడంతో జట్టు స్కోర్ 404/5గా నమోదైంది. చివరికి శ్రీలంక 251 పరుగులకు ఆలౌటైంది. అది రోహిత్ స్కోర్ కన్నా 13 పరుగులు తక్కువ కావడం విశేషం.
-
On This Day 3 Years Ago@ImRo45 Hits 4 Consecutive Sixes in a Over 💉
— ADARSH (@Adarshdvn45) December 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
3rd ODI Double Hundred For Hitman 🔥 pic.twitter.com/w8c17mbPMi
">On This Day 3 Years Ago@ImRo45 Hits 4 Consecutive Sixes in a Over 💉
— ADARSH (@Adarshdvn45) December 13, 2020
3rd ODI Double Hundred For Hitman 🔥 pic.twitter.com/w8c17mbPMiOn This Day 3 Years Ago@ImRo45 Hits 4 Consecutive Sixes in a Over 💉
— ADARSH (@Adarshdvn45) December 13, 2020
3rd ODI Double Hundred For Hitman 🔥 pic.twitter.com/w8c17mbPMi
డబుల్ ట్రిపుట్ ఢమాకా..
వన్డే క్రికెట్‌లో హిట్‌మ్యాన్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన మరో మూడేళ్లకు లంకపై రెండోసారి దండయాత్ర చేశాడు. 2017 శ్రీలంక భారత పర్యటన సందర్భంగా డిసెంబర్ 13న పంజాబ్ మొహాలి స్టేడియంలో ఎవరూ ఊహించని విధంగా డబుల్ ట్రిపుల్ ఢమాకా పేల్చాడు. మరోసారి ధావన్(68; 67 బంతుల్లో 9x4)తో కలిసి రోహిత్(208; 153 బంతుల్లో 13x4, 12x6) బౌండరీల వర్షం కురిపించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించారు. ధావన్ ఔటయ్యాక శ్రేయస్ అయ్యర్(88; 70 బంతుల్లో 9x4, 2x6)తో మరో అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో భారత్ 392/4 స్కోర్ చేసింది. ఇక లంక ఛేదనలో మరోసారి తడబడి 251/8 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ జరిగి నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా, హిట్‌మ్యాన్ మున్ముందు ఇలాగే మరిన్నిసార్లు డబుల్ ధమాకాను పేల్చాలని అభిమానులు ఆశిస్తున్నారు.