మొదట్లో క్రికెట్ అంటే కేవలం టెస్టులు, వన్డేలు. ఈ రెండు ఫార్మాట్లే ఉండేవి. టీ20 ఫార్మాట్ ఆ తర్వాత వచ్చింది. అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఈ పొట్టి ఫార్మాట్ ఎప్పుడు, ఎక్కడ పుట్టింది. తొలి మ్యాచ్ ఎవరి మధ్య జరిగింది? అందులో విజేత ఎవరు? అనే ఆసక్తికర అంశాలు మీ కోసం.
2005 ఫిబ్రవరి 17న టీ20 మ్యాచ్ తొలిసారిగా ఆక్లాండ్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టు గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 214/5 పరుగులు చేసింది. కెప్టెన్ రికీ పాంటింగ్ 55 బంతుల్లోనే 8 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 98 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టీమ్ ఛేదనలో చతికిలపడింది. 170 పరుగులకే ఆలౌటైంది. మైకేల్ కాస్ప్రోవిచ్ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాంటింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
కాగా ఇప్పటివరకు ఆరు టీ20 వరల్డ్ కప్‌లు జరిగాయి. వాటిలో వెస్టిండీస్ జట్టు అత్యధికంగా రెండు సార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది.
ఇదీ చదవండి: 'ఆర్సీబీ.. మాక్స్‌వెల్‌ను దక్కించుకోవచ్చు'