విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ఇంట్లో పని మనుషులెవరూ ఉండరని, అతిథులకు స్వయంగా వాళ్లే భోజనం వడ్డిస్తారని అంటున్నాడు మాజీ సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్.
"మైదానం బయట కోహ్లీ వ్యక్తిత్వం విభిన్నంగా ఉంటుంది. తన భార్య అనుష్కతో కలిసి ఉండే ఇంట్లో అసలు పనోళ్లే ఉండరు. అతిథులకు అతను, తన భార్య భోజనం వడ్డిస్తారు. అతను మనతోనే కూర్చుని మాట్లాడతాడు. మనతోనే కలిసి బయటకు విందుకు వస్తాడు. మిగతా ఆటగాళ్లందరికీ కోహ్లీ అంటే ఎంతో గౌరవం. అతను ఎంతో ఎత్తుకు ఎదిగిన చాలా సాధారణంగా ఉంటాడు" అని శరణ్ చెప్పాడు.
ఇదీ చూడండి: పింక్ టెస్టు కోసం నెట్స్‌లో శ్రమిస్తున్న కోహ్లీ సేన