శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్ సాధించిన కరీబియన్ జట్టు.. నామమాత్రమైన మూడో వన్డేలోనూ 5 వికెట్ల తేడాతో లంకను ఓడించింది.
మొదట బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. స్పిన్నర్ అకీల్ (3/33) ధాటికి ఒక దశలో ఆ జట్టు 151/6తో నిలిచినా.. హసరంగ (80 నాటౌట్; 60 బంతుల్లో), అషెన్ బండార (55 నాటౌట్; 74 బంతుల్లో) లంకను ఆదుకున్నారు. ఛేదన ప్రారంభంలో విండీస్ 39/2తో తడబడింది. అయితే డారెన్ బ్రావో (102; 132 బంతుల్లో).. షై హోప్ (64; 72 బంతుల్లో)తో కలిసి విండీస్‌ను విజయం వైపు నడిపించాడు. వీళ్లిద్దరూ ఔటైనా.. కెప్టెన్ పొలార్డ్ (53 నాటౌట్; 42 బంతుల్లో) హోల్డర్ (14 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఇదీ చదవండి : మిగిలిన టీ20ల్లో అభిమానులకు నో ఎం