ETV Bharat / sports

'రూట్ ఆట చూసి చాలా నేర్చుకోవచ్చు' - sangakkara praises england joe root

శ్రీలంకతో జరుగుతోన్న టెస్టు సిరీస్​లో​ ఇంగ్లాండ్​ సారథి జో రూట్​ ఆట తీరు ప్రతి ఆటగాడికి స్ఫూర్తిదాయకమని అన్నాడు లంక మాజీ సారథి సంగక్కర. అతడి ఆట నుంచి చాలా నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.

root
రూట్​
author img

By

Published : Jan 25, 2021, 2:14 PM IST

ఇంగ్లాండ్​ సారథి జో రూట్​ ఆట తీరు నుంచి ప్రతి ఆటగాడు చాలా నేర్చుకోవచ్చని అభిప్రాయపడ్డాడు శ్రీలంక మాజీ సారథి సంగక్కర.

ప్రస్తుతం లంక జట్టుతో ఇంగ్లాండ్​ రెండు మ్యాచులతో కూడిన టెస్టు సిరీస్​ ఆడుతోంది. తొలి టెస్టులో డబుల్​ సెంచరీ బాదిన రూట్​.. రెండో టెస్టులోనూ 186(శతకం) చేసి పలు రికార్డులు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే రెండో టెస్టు మూడు రోజు ఆటలో అతడి​ ఆట తీరు.. ప్రతి ఆటగాడికి స్ఫూర్తిదాయకమని అన్నాడు సంగక్కర.

"రూట్​ ఆటతీరును చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఎంతో అత్యుత్తమంగా ఆడాడు. అతడి వ్యూహాలు, ప్రణాళికలను పక్కాగా అమలుచేయడం, రివర్స్​ స్వీప్​, స్ట్రైక్​ రొటేషన్​, టెక్నిక్​, ప్రశాంత స్వభావము, సమతుల్యం చేసుకుంటూ పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ఇలా ప్రతిదీ అద్భతుం, అసాధారణం. అతడి నుంచి చాలా నేర్చుకోవచ్చు. పిచ్​ను, అక్కడి పరిస్థితులను అన్నింటిని తన ఆధీనంలోకి తీసేసుకున్నాడు. అతడి ఆటను చూసి చాలా నేర్చుకున్నా."

-సంగక్కర, లంక మాజీ సారథి.

సహ ఆటగాడు జాస్​ బట్లర్​ కూడా రూట్​ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. "స్పిన్ బౌలింగ్ పై రూట్ ఆడిన ఇన్నింగ్స్ మాస్టర్ క్లాస్​గా ఉంది. 30 ఏళ్ల రూట్ ఇన్నింగ్స్ చూస్తూ చాలా నేర్చుకోవచ్చు." అని పొగిడాడు.

రూట్​ రికార్డు

శ్రీలంకతో జరుగుతోన్న టెస్టు సిరీస్​లో ఇంగ్లాండ్​ సారథి జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగి వరుసగా రికార్డులు నమోదు చేశాడు. టెస్టు క్రికెట్​లో తమ జట్టు తరఫున అత్యధికంగా 8,238 పరుగులు సాధించిన ఇంగ్లాండ్​ నాలుగో క్రికెటర్​గా నిలిచాడు. మూడు శతకాలు బాది.. కెరీర్​లో మొత్తం 19సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇదీ చూడండి : ఇంగ్లాండ్​ సారథి జో రూట్​ మరో రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.