మనదేశంలో క్రికెట్‌ను ఆటలా కాకుండా మతంలా చూస్తారు. క్రికెట్‌తో పాటు ఆటగాళ్లకు సంబంధించిన ఏ విషయమైన అభిమానులకూ ఆసక్తికరమే. ఈ క్రమంలోనే టీమ్ఇండియా కొత్త జెర్సీ గురించి సోషల్‌మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. జెర్సీపైన బీసీసీఐ లోగోకి పైన ఉన్న మూడు నక్షత్రాలు ఎందుకు పెట్టారా? అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అవి ఎందుకు ఉన్నాయంటే?
![The reason behind three stars on Team India's retro jersey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9701899_2.jpg)
మూడు ప్రపంపచకప్లకు గుర్తుగా
భారత్ ఇప్పటివరకు మూడు ప్రపంచకప్‌లను గెలుచుకుంది. కపిల్ దేవ్ సారథ్యంలో 1983 ప్రపంచకప్.. ఆ తర్వాత ధోనీ నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. దీంతో టీమ్ఇండియా ఖాతాలో మూడు ప్రపంచకప్‌లు చేరాయి. దీనికి గుర్తుగానే జెర్సీలపై ఈ మూడు నక్షత్రాలను ముద్రించినట్లు తెలుస్తోంది. అలాంటి ప్రతిష్ఠాత్మక జెర్సీని ధరించడం తమకు దక్కిన అదృష్టమని ఆసీస్‌తో తొలి వన్డేకు ముందు కెప్టెన్ కోహ్లీ చెప్పాడు.
"మా జట్టుపై కోట్లాది మంది అభిమానుల ఆశలు ఉన్నాయని తెలుసు. అందుకే ఎంతో బాధ్యతగా జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడేందుకు ప్రయత్నిస్తాను. ఆటలో ఒత్తిడి ఎప్పుడూ ఉండేదే. అయితే జెర్సీపై మూడు నక్షత్రాలు.. టీమ్ఇండియా అంటే ఏంటో, వాళ్లు ఏం సాధించారో సూచిస్తుంది. మూడు ప్రపంచకప్‌లు సాధించిన జట్టులో భాగం కావడం నాకు దక్కిన గౌరవం" అని సారథి కోహ్లీ అన్నాడు.
ఇదీ చూడండి: టీమ్ఇండియా జెర్సీ మార్పు వెనకున్న కారణమిదే!